Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7 ; పేరెంట్స్ గురించి మాట్లాడొద్దు.. భోలేపై శోభా ఫైర్.. మండిపడ్డ ప్రియాంక..

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కంటెస్టెంట్ల మధ్య వాడివేడి చర్చతో నామినేషన్స్ జరిగాయి. మోజారిటీ కంటెస్టెంట్లు శోభాశెట్టిని టార్గెట్ చేశారు.
 

Bigg Boss Telugu 7 Nominations Day NSK
Author
First Published Oct 23, 2023, 11:04 PM IST | Last Updated Oct 23, 2023, 11:04 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 విజయవంతంగా రన్ అవుతోంది. నేటితో ఎనిమిదవ వారం 51వ రోజు హౌజ్ లో నామినేషన్స్  జరిగాయి. నిన్నటి ఎపిసోడ్లో కంటెస్టెంట్ పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యింది. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్స్ ఓటింగ్ ఆధారంగా ఆమెకు ఈ ఛాన్స్ దక్కింది. 

ఇక ఈ వారానికి నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు మొదలైంది. ప్రతి హౌస్ మేట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన హౌస్ మేట్ ఫోటో మంటల్లో కాల్చివేయాలి.  మొదటగా శివాజీ శభాశెట్టిని నామినేట్ చేశారు. ఎవరైనా క్షమించాలని కోరినప్పుడు కాస్తా ఆలోచించాలంటూ ఆమెను నామినేట్ చేశారు. చిన్న విషయాలకూ సరిగా రియాక్ట్ కావడం రాలేదంటూ శోభాశెట్టిని అశ్విని కూడా నామినేట్ చేశారు. ఇక గౌతమ్ కృష్ణ ప్రశాంత్ ని,  భోలే షావలిని నామినేట్ చేశారు. ప్రియాంక కూడా భోళే షావలిని నామినేట్ చేసింది. తన రెండో నామినేషన్ ను అశ్వినిని చేసింది. అశ్విని హౌజ్ లోకి వచ్చిన ఫస్ట్ డే నుంచి లేడీస్ తో కనెక్షన్ కుదరడం లేదంటే.. ఆమె అసలు అర్థం చేసుకోవడం లేదనేదే రీజన్ గా నామినేట్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ప్రియాంక యావర్ ను నామినేట్ చేసింది.

ఆట సందీప్ కూడా భోళే షావలి మాటతీరును తప్పబడుతూ నామినేట్ చేశారు. భోలే.. శోభాశెట్టిని, అమర్ ను నామినేట్ చేశారు. ఇక శోభా శెట్టి మాత్రం శివాజీని, యావర్ ను నాటిమినేట్ చేసి తన రీజన్ ను తెలిపింది.  ఈ సందర్బంగా కంటెసెంట్ల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. శోభా.. భోలే మధ్య  గట్టి వాగ్వాదం జరిగింది. అలాగే ప్రియాంకతోనూ మాటల యుద్ధం జరిగింది. గౌతమ్.. ప్రశాంత్ మధ్య కూడా వేడి చర్చ జరిగింది. ప్రశాంత్ ను నామినేట్ చేయడంతో గౌతమ్ పై ఫైర్ అయ్యారు. తన గుండెలో మంట ఆరదని అభిప్రాయపడ్డారు. అలాగే గౌతమ్ ను నామినేట్ చేసిన  సమయంలో భోలేపైనా గౌతమ్ ఫైర్ అయ్యారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios