Bigg Boss Telugu 7: పహిల్వాన్ తో కుస్తీ... ఆ ఇద్దరు సెకండ్ రౌండ్ కి, గెలిస్తే హ్యూజ్ గిఫ్ట్!
బిగ్ బాస్ సీజన్ 7 కాన్సెప్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇక బిగ్ బాస్ వాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కుస్తీలో గెలిచిన కంటెస్టెంట్ కి ఐదు వారాల ఇమ్యూనిటీ ఉంటుందని బిగ్ బాంబు పేల్చాడు.

బిగ్ బాస్ తెలుగు 7 అంత ఈజీగా సాగడం లేదు. ఫుడ్ నుండి ఫర్నిచర్ వరకు అన్నీ గెలుచుకోవాల్సిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి భారీ ఆఫర్ ఇచ్చాడు. ఒక టాస్క్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే.... వారికి ఐదు వారాలు ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ ఉంటుందని చెప్పాడు. అయితే టాస్క్ అంత ఈజీ కాదు. ప్రొఫెషనల్ పహిల్వాన్ లతో కంటెస్టెంట్స్ పోటీ పడాల్సి ఉంది.
లేడీ కంటెస్టెంట్స్ కోసం ఒక కుస్తీ పహిల్వాన్, జెంట్స్ కంటెస్టెంట్స్ కోసం మరో పహిల్వాన్ ని రంగంలోకి దించారు. ఈ టాస్క్ లో చాలా మంది చేతులు ఎత్తేశారు. కనీసం గెలిచే ప్రయత్నం చేయలేదు. కొందరు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ అంటే ప్రతి టాస్క్ లో కష్టపడాలని అర్థం చేసుకున్నారు. వాళ్ళు శక్తి వంచన లేకుండా పోరాడారు. అబ్బాయిలో ఆట సందీప్, రైతు బిడ్డ ప్రశాంత్ సత్తా చాటారు. ఎక్కువ సేపు రింగ్ లో ఉన్నారు. కండల వీరుడు ప్రిన్స్ యావర్ తేలిపోవడం విశేషం. అతడు ఎక్కువ సేపు రింగ్ లో ఉండలేకపోయాడు.
ఇక అమ్మాయిల్లో ప్రియాంక సింగ్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. దీంతో అబ్బాయిల్లో ఆట సందీప్, అమ్మాయిల్లో ప్రియాంక సింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. వీరిద్దరిలో ఒకరు 5 వారాల ఇమ్యూనిటీ గెలిచే అవకాశం ఉంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో వీరిద్దరూ లేకపోవడం విశేషం.
ఇక గేమ్ లో ఓడిపోయినందుకు గౌతమ్ కృష్ణ ఏడ్చాడు. అతన్ని తోటి కంటెస్టెంట్స్ ఓదార్చారు. కాగా 14 మంది కంటెస్టెంట్స్ ఉన్న హౌస్లో మొదటి వారం 8 మంది నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, దామిని, ప్రిన్స్ యావర్, షకీలా, శోభిత శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు.