Bigg Boss Telugu 7: బిగ్ బాస్ డెసిషన్ తో శివాజీ, షకీలాకు అన్యాయం... సీనియర్స్ షాకింగ్ డెసిషన్!
పవర్ అస్త్ర రేసులో శివాజీ, షకీలా ఉండగా వాళ్లకు అన్యాయం జరిగింది. ఆల్రెడీ కంటెండర్స్ గా వాళ్ళు పోటీ పడాల్సి ఉండగా మరొకరిని రేసులోకి తెచ్చారు.

బిగ్ బాస్ హౌస్లో పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతుంది. రణధీర-మహాబలి టీమ్స్ కంటెస్టెంట్స్ ని విభజించి బిగ్ బాస్ టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. రెండు రౌండ్స్ లో ఓడిపోయిన మహాబలి టీమ్ రేసు నుండి తప్పుకుంది. రణధీర టీమ్ లో ఉన్న అమర్ దీప్, ప్రియాంక సింగ్, శోభా శెట్టి, శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్ లలో ఒకరు పవర్ అస్త్ర గెలుచుకుంటారు. ఈ ఆరుగురిలో ఇద్దరిని ఎంచుకునే బాధ్యత ఓడిపోయిన మహాబలి టీమ్ కి ఇచ్చారు.
రణధీర టీమ్ లో గల ఆరుగురు సభ్యుల వాద్య మాయాస్త్ర భాగాలు ఉన్నాయి. మహాబలి టీమ్ నుండి ఒక్కొక్కరిగా వచ్చి ఆరుగురిలో పవర్ అస్త్రకు అనర్హుడు అని భావించిన కంటెస్టెంట్ నుండి మాయాస్త్ర భాగం తీసుకుని అర్హుడు అని భావిస్తున్న కంటెస్టెంట్ కి ఇవ్వాలి. ఈ టాస్క్ లో మొదటిగా మహాబలి టీం లీడర్ దామిని వచ్చింది. ప్రియాంక చేతిలో ఉన్న మాయాస్త్ర భాగం తీసుకుని షకీలాకు ఇచ్చింది. ప్రశాంత్ అమర్ దీప్ నుండి తీసుకుని శివాజీకి ఇచ్చాడు.
ఈ గేమ్ లో రతికా రచ్చ రచ్చ చేసింది. నేను చివర్లో వెళతానని టీమ్ కి వ్యతిరేకంగా మాట్లాడింది. రతికా కారణం ఈ టాస్క్ లేటైంది. రతిక చేసిన తప్పుకు బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి బలయ్యేలా చేసింది. దీంతో రేసులో ఉన్న ముగ్గురు తప్పుకోగా ప్రిన్స్ యావర్, శివాజీ, షకీలా పవర్ అస్త్ర కోసం పోటీపడ్డారు. మహాబలి టీమ్ సభ్యుల నిర్ణయం కారణంగా ప్రిన్స్ కూడా ఓడిపోయాడు. శివాజీ, షకీలా మిగిలారు.
నెక్స్ట్ టాస్క్ లో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే సంచాలకుడిగా వ్యవహరిస్తున్న ఆట సందీప్ ఒకరిని పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు ఎంచుకోవచ్చని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆట సందీప్ అమర్ దీప్ కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో శివాజీ, షకీలా అసహనానికి గురయ్యారు. టాస్క్స్ ముగిశాయి. మేము ఇద్దరం పోటీలో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా అమర్ దీప్ ని రేసులోకి తేవడం ఏంటని ఫైర్ అయ్యారు. అంతా ముందుగానే అనుకోని గ్రూప్ గా ఆడుతున్నారు. మేము వెళ్లిపోతాం అని షకీలా, శివాజీ కేకలు వేశారు. నిజం చెప్పాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని వారికి పోటీగా తెచ్చి వారి విజయావకాశాలు దెబ్బ తీశారు.