BiggBossTelugu7:డబ్బుల్లేక పార్క్ లో ఆకలితో పడుకుని.. కొడుకు మాటలకు శివాజీ ఎమోషనల్
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి ఇక మూడు రోజులు మాత్రమే ఉంది. దీనితో ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్ లు ఫన్ టైం ఎంజాయ్ చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి ఇక మూడు రోజులు మాత్రమే ఉంది. దీనితో ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్ లు ఫన్ టైం ఎంజాయ్ చేస్తున్నారు. నేడు గురువారం ఎపిసోడ్ సరదాగా సాగింది. కంటెస్టెంట్లకు వారి కుటుంబ ఇష్టమైన వంటకాలు పంపించారు.
అయితే కుటుంబ సభ్యులు పంపిన వంటకాలు దక్కించుకోవాలనుంటే వారి తరుపున ఇతర సభ్యులు గేమ్ ఆడి గ్రహాంతరవాసులని మెప్పించాలి. ముందుగా అర్జున్ సతీమణి తన భర్త కోసం మటన్ కర్రీ, రాగి సంగటి పంపింది. అర్జున్ తన భార్య పంపిన ఫుడ్ అందుకోవాలంటే యావర్ షేక్ బేబీ షేక్ గేమ్ గెలవాలి. గతంలో లాగా కాకుండా యావర్ అద్భుతంగా గేమ్ ని ఫినిష్ చేశాడు. దీనితో అర్జున్ కి ఫుడ్ దక్కింది. తన భార్య ప్రేమతో పంపిన ఫుడ్ ని అర్జున్ ఇంటి సభ్యులకు షేర్ చేశాడు.
ఆ తర్వాత శివాజీకి తన ఫ్యామిలీ నుంచి ఫుడ్ వచ్చింది. శివాజీ కొడుకు వీడియో సందేశం ద్వారా.. నాన్న నీకు చికెన్ కర్రీ పంపిస్తున్నాం. హైదరాబాద్ లో డబ్బులు లేని సమయంలో ఆకలితో పార్క్ లో పడుకున్న రోజులని శివాజీ కొడుకు గుర్తు చేశాడు. ఆ మాటలకు శివాజీ ఎమోషనల్ అయ్యాడు.అలాంటి ఆకలి రోజుల నుంచి నిన్ను ఆర్టిస్ట్ గా చేసిన ప్రేక్షకులని గుర్తు చేసుకుని చికెన్ తిను అని చెప్పాడు.
శివాజీ తరుపున ప్రియాంక యారో బ్యాలన్స్ చేసే గేమ్ ని సక్సెస్ ఫుల్ గా ఆడింది. శివాజీ చికెన్ తీసుకుని ఇది మా ఆవిడా చేసిన చికెన్ కాదు.. మా అత్తగారు అయినా లేదా మా అమ్మ అయినా చేసి ఉండాలి అని శివాజీ స్మెల్ ని బట్టి గెస్ చేశాడు. ఆ తర్వాత అమర్ కి తన సతీమణి తేజస్విని గౌడ రొయ్యల బిర్యానీ పంపింది.
ఫుడ్ ని ఎంజాయ్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్ లో ఇన్ని రోజుల పెర్ఫామెన్స్ ని బట్టి 60 నిమిషాల ఎపిసోడ్ లో కనిపించాల్సి వస్తే మీకు మీరు ఎన్ని నిమిషాలు ఎంచుకుంటారు.. ఇతరులకి ఎన్ని నిమిషాలు ఇస్తారు అని బిగ్ బాస్ ప్రశ్నించారు. దీనితో అర్జున్ 10 నిమిషాలు కనిపిస్తా అని మెడలో ఆ ట్యాగ్ వేసుకున్నారు. అమర్ 15 నిమిషాలు. శివాజీ 10 నిమిషాలు ఎంచుకున్నారు.
- Amar prashanth fight
- Bigg Boss 7 Amardeep
- Bigg Boss 7 Telugu
- Bigg Boss Teja elimination
- Bigg Boss Telugu 7 elimination
- Bigg Boss Telugu7
- Bigg Boss Telugu7 Finalist
- Gautham Eliminated
- King Nagarjuna
- Pallavi Prashanth
- Prince yavar
- Priyanka Jain
- Shobha Shetty Eliminated
- Shobha shetty
- Sivaji
- Tasty Teja eliminated
- amar deep
- yavar