Bigg Boss Telugu 7: నువ్వు హౌస్లో ఉన్నావా లేక ఒకరి వెంటే ఉన్నావా? గౌతమ్ కి నాగార్జున స్ట్రైట్ క్వశ్చన్!
బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ మీద రివ్యూ చేశాడు. పనిలో పనిగా గౌతమ్ కృష్ణను నిలదీశాడు.

బిగ్ బాస్ తెలుగు 7(Bigg Boss Telugu 7) లేటెస్ట్ సీజన్ ఫస్ట్ వీకెండ్ అద్భుతంగా మొదలైంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చేశారు. ఎప్పటిలాగే హౌస్ మేట్స్ పెర్ఫార్మన్స్, ప్రవర్తన మీద రివ్యూ చేశారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని తన ప్రశ్నలతో గిలిగింతలు పెట్టాడు. కొందరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఫస్ట్ వీక్ కావడంతో ఎవరేం చేసినా పెద్దగా పట్టించుకోరు. వారాలు గడిచేకొద్దీ హోస్ట్ తనలోని ఫైర్ బయటకు తీస్తారు. తప్పు చేసిన వాళ్లకు శిక్షలు, పరీక్షలు పెడతారు. శనివారం నాగార్జున కూల్ గా కనిపించారు.
అదే సమయంలో జంటలుగా మారుతున్న కంటెస్టెంట్స్ కూపీ లాగే ప్రయత్నం చేశారు. వస్తూ వస్తూనే షకీలాను పలకరించారు. ఎలా ఉన్నారని అడిగారు. అలాగే మరో సీనియర్ కంటెస్టెంట్ శివాజీని మొదటిగా రివ్యూ చేశాడు. ఆట సందీప్ రతికా రోజ్ చెప్పులు మోయడం గురించి అడిగాడు. సందీప్ నువ్వు ఎప్పుడైనా నీ భార్యలు చెప్పులు మోసావా? అంటూ పరోక్షంగా పంచ్ వేశాడు.
గౌతమ్ కృష్ణను ఓ స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు. నువ్వు హౌస్లో ఉన్నావా? లేక ఒకరి వెంటే ఉన్నావా? అని అడిగాడు. గౌతమ్ కృష్ణ లేడీ కంటెస్టెంట్ శుభశ్రీని చూస్తూ హౌస్లోనే ఉన్నా సర్ అని సమాధానం చెప్పాడు. ఆయనకు వీరి లవ్ స్టోరీపై డౌట్ వచ్చేసిందని అర్థం అవుతుంది. ఫస్ట్ వీక్లోనే శుభశ్రీకి ఫ్లాట్ అయిన గౌతమ్ కృష్ణ చాలా పొసెసివ్ గా ఉంటున్నాడు. ఆమె తనతోనే ఉండాలి, మాట్లాడాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
దీంతో ఆట మరచి అప్పుడే అమ్మాయి వెనకాల పడుతున్నావని నాగార్జున పరోక్షంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. రైతుబిడ్డ ప్రసన్న ప్రశాంత్, రతికా రోజ్ సన్నిహితంగా ఉండటాన్ని కూడా నాగార్జున ప్రస్తావించాడు. నేను ఇచ్చిన మొక్కను జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అని పల్లవి ప్రశాంత్ ని అడిగాడు. ఇక కిరణ్ రాథోడ్ ని ఉద్దేశిస్తూ నువ్వు హౌస్లో ఉన్నట్లే లేదు. ఆమె ఎప్పుడూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుందని ఒకింత అసహనం బయటపెట్టాడు. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయాలు ఉన్నాయి..
కాగా అతి తక్కువ ఓట్లతో కిరణ్ రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారట. నామినేషన్లో ఉన్న 8 మందిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో ఎలిమినేట్ అయ్యే తొలి కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ అంటున్నారు. ఒకప్పుడు కిరణ్ రాథోడ్ సౌత్ లో టాప్ యాక్ట్రెస్. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హౌస్లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే పేరున్న నటి. హౌస్లో సంచలనాలు చేస్తుందనుకుంటే ఆమె ఫస్ట్ వీకే వెళ్ళిపోతుందని అంటున్నారు. అయితే ఒక్కోసారి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు. అదే సమయంలో షో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం....