గౌతమ్ కి స్పెషల్ పవర్... ఆ కంటెస్టెంట్ నేరుగా నామినేట్!
సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. దాంతో గౌతమ్ తన పగ తీర్చుకున్నాడు.

గత ఆదివారం బిగ్ బాస్ తెలుగు 7 రీ లాంచ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే హోస్ట్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. శివాజీ, అమర్ దీప్, యావర్, గౌతమ్, శుభశ్రీ. తేజా, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో శుభశ్రీ బాటమ్ త్రీలో ఉందని ఎలిమినేట్ చేశారు. ఇక మిగతా ఆరుగురిలో శివాజీ, ప్రియాంక, యావర్, అమర్ దీప్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి తేజా-గౌతమ్ మిగిలారు. వీరిలో ఒకరిని ఇంటికి పంపే నిర్ణయం మిగతా ఏడుగురు హౌస్ మేట్స్ కి ఇచ్చారు.
శివాజీతో పాటు మరో ఐదుగురు గౌతమ్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. అతడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. తేజాకు వ్యతిరేకంగా ఒక్క సందీప్ మాత్రమే ఓటు వేశాడు. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. కాగా నాగార్జున గౌతమ్ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. తనను సీక్రెట్ రూమ్ కి పంపుతున్నట్లు వెల్లడించాడు. దాదాపు 34 గంటలు ఒక్కడే సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ ఆట గమనించాడు.
నామినేషన్స్ డే బయటకు వచ్చాడు. వస్తూ వస్తూనే భారీ డైలాగ్స్ కొట్టాడు. రాననుకున్నారా రాలేననుకున్నారా?. నేను అశ్వద్ధామ. ఈ అశ్వద్ధామకు చావు లేదంటూ తనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన హౌస్ మేట్స్ ని హెచ్చరించాడు. అనంతరం శివాజీతో గొడవకు దిగాడు. గౌతమ్ ఎంటర్టైన్ చేయలేడు అని చెప్పావు. ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాంటు విప్పుకుని తిరగడమా... అని గౌతమ్ ప్రశ్నించాడు. బట్టలు లేకుండా తిరగడం ఎంటర్టైన్మెంటా అని ఇంత మంది ముందు అడుగుతున్నావు. నేను బట్టలు లేకుండా 90 సినిమాలు చేశాను అని శివాజీ కౌంటర్ వేశాడు. నేను యాక్టర్ ని ఏదైనా చేస్తా అన్నాడు... గౌతమ్-శివాజీ మధ్య వాడి వేడి చర్చ జరిగింది.
కాగా బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. గౌతమ్ కి స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చని చెప్పాడు. మరి ఈ పవర్ తో ఎవరిని నామినేట్ చేశాడు అనేది సస్పెన్సు. బహుశా శివాజీ మీద కోపంగా ఉన్నాడు.