Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్లో విడాకుల పర్వం... తన్నుకోబోయిన తేజా-శోభా శెట్టి!

బిగ్ బాస్ హౌస్లో విడాకుల పర్వం చోటు చేసుకుంది. టాస్క్ లో భాగంగా తేజా-శోభా తన్నుకోబోయారు. వారిని ఇతర కంటెస్టెంట్స్ ఆపారు. 
 

bigg boss telugu 7 fight between tasty teja and shobha shetty ksr
Author
First Published Oct 18, 2023, 1:48 PM IST | Last Updated Oct 18, 2023, 1:48 PM IST

7వ వారం కెప్టెన్సీ టాస్క్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా ఇంటి సభ్యులను రెండుగా విభజించాడు. గులాబీ పురం, జిలేబి పురం గ్రామస్తులుగా విభజించి. వారికి పాత్రలు ఇచ్చాడు. గులాబీ పురం, జిలేబి పురం టీమ్ సభ్యుల్లో ఎవరు ఏలియన్స్ ని బాగా ఎంటర్టైనర్ చేస్తారో వారు కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉంటారు. ఇక గులాబీ పురం సర్పంచ్ శోభా మాజీ భర్త తేజ. ఊళ్ళో వాళ్లకు గాసిప్స్ చెప్పే టీ కొట్టు యజమానిగా అమర్ దీప్ ఉంటాడు. యావర్ యూఎస్ నుండి పల్లెటూరిని అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వస్తాడు.. 

గులాబీ పురం టీమ్ లో పూజా, గౌతమ్ కూడా ఉన్నారు. వారికి కూడా బిగ్ బాస్  క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఇక జిలేబీ పురంలో పాత్రలను అర్జున్, అశ్వినీ శ్రీ, పల్లవి ప్రశాంత్, శివాజీ, సందీప్, భోలే పోషిస్తారు. గులాబీ పురం, జిలేబీ పురం పాత్రల్లో రెండు టీమ్స్ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. విడాకులైన తేజా-శోభా కొట్టుకోబోయారు. 

పల్లెటూరి హాట్ గర్ల్ అశ్వినీని అర్జున్ ఫ్లర్ట్ చేస్తున్నాడు. అర్జున్ అసిస్టెంట్ గా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. శివాజీ ఏకంగా అశ్వినీని తోటకు రమ్మన్నాడు. లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ రెండు టీమ్స్ లో ఏలియన్స్ ఇంప్రెస్ చేసిన టీమ్ కంటెండర్ టాస్క్ లో నిలుస్తుంది. ప్రతిసారి ఫిజికల్ టాస్క్స్ ఇస్తున్న బిగ్ బాస్ ఈసారి ఎంటెర్టైన్గ్ టాస్క్ ఇచ్చాడు. 

ఇక ఏడవ వారానికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. పల్లవి ప్రశాంత్, తేజా, అమర్, గౌతమ్, పూజా మూర్తి, భోలే, అశ్వినీ శ్రీ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన శుభశ్రీ, దామిని, రతికా రోజ్ లలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రావాలనుకుంటున్నారో ఓటు వేయాలని కంటెస్టెంట్స్ కి చెప్పాడు బిగ్ బాస్. ఓటింగ్ అనంతరం... తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని ట్విస్ట్ ఇచ్చాడు... 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios