Bigg Boss Telugu 7: దెయ్యాల్లా భోలే మీద పడ్డ సీరియల్ హీరోయిన్స్... నామినేషన్స్ లో ఆ ఏడుగురు!
ఏడవ వారానికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ వారానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. మంగళవారం ఎపిసోడ్లో భోలే షావలితో శోభా, ప్రియాంక యుద్దానికి దిగారు.

సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం వరకు సాగింది. హౌస్లో ఉన్న ఇంటి సభ్యులు అందరూ సమానమే అన్న బిగ్ బాస్ ప్రతి ఒక్కరూ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. వారి ఎదురుగా ఉన్న కుండను బద్దలు కొట్టాలని ఆదేశించాడు. పల్లవి ప్రశాంత్ తో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. పల్లవి ప్రశాంత్ తగు కారణాలు చెప్పి సందీప్, టేస్టీ తేజాలను నామినేట్ చేశాడు. అమర్ దీప్, భోలే, అశ్వినిలను నామినేట్ చేశాడు. పూజా మూర్తి, అర్జున్, ప్రియాంక కూడా వారినే నామినేట్ చేశారు.
అశ్వినీ హౌస్లో తనను ఒంటరిని చేశారు. నాతో ఎవరూ మాట్లాడటం లేదు. కానీ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తున్నారని ఆవేదన చెందింది. భోలే షావలి మాత్రం కూల్ యాటిట్యూడ్ మైంటైన్ చేశాడు. అందరూ నన్నే నామినేట్ చేస్తున్నారు. నామినేషన్స్ కోసమే నన్ను వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్లో తెచ్చారనుకుంటా అని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్-సందీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కెప్టెన్ అయిన నాకు ఇజ్జత్ ఇయ్యలేదని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. తిరిగి సందీప్ అతడిని నామినేట్ చేశాడు.
మాటల్లో మాటగా నన్ను ఊరోడు అని కించపరిచినట్లు పల్లవి ప్రశాంత్ అన్నాడు. అతను అనలేదని సందీప్ తాను అమ్మగా భావించే వృత్తిపై ప్రమాణం చేశాడు. అలాగే నువ్వు నీ భూమి మీద, తినే తిండి మీద ప్రమాణం చేయాలని సందీప్ కోరాడు. ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ మాట మార్చాడు. ఇక మంగళవారం నామినేషన్స్ లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన మిత్రుడు తేజాను శోభా నామినేట్ చేసింది. రూల్స్ పాటించకుండా పొగరుగా వ్యవహరించాడని కారణం చెప్పింది.
శోభా శెట్టి మరో ఎలిమినేషన్ వాగ్వాదానానికి దారి తీసింది. ఆమె భోలేను నామినేట్ చేసింది. భోలే బూతులు మాట్లాడుతున్నాడు. అతని ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు చేసింది. వీరిద్దరి గొడవలోకి ప్రియాంక కూడా వచ్చింది. ఆడవాళ్లు అంటే నాకు రెస్పెక్ట్ అని భోలే అన్నాడు. అదంతా నటన అంటూ ప్రియాంక ఫైర్ అయ్యింది. ఒక దశలో థూ అని ఊచింది. దానికి భోలే హర్ట్ అయ్యాడు. అదే పని నేను తిరిగి చేస్తే నీ బ్రతుకు ఏం కావాలని భోలే అన్నాడు.
తిరిగి భోలే... ప్రియాంక, శోభా శెట్టిలను నామినేట్ చేశాడు. అప్పుడు కూడా వివాదం రాజేసుకుంది. భోలా వింత ప్రవర్తనకు ధీటుగా ప్రియాంక కూడా వెకిలి చేష్టలు చేసింది. ఇక ఈ వారానికి అమర్ దీప్, గౌతమ్, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.
నామినేషన్స్ అనంతరం భోలే... ప్రియాంక, శోభా దగ్గరకు వెళ్లి మంచి చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇద్దరూ భోలే వెళ్లిపోవాలని సీరియస్ అయ్యారు. యావర్, శివాజీ అక్కడకు రావడంతో భోలేని ఇక్కడి నుండి తీసుకెళ్లాలని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇక శోభా తనను నామినేట్ చేయడంతో తేజా ఫీల్ అయ్యాడు. హౌస్లో ఉన్న 12 మంది నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. నువ్వు నామినేట్ చేయడం బాధకలిగించిందని శోభాతో అన్నాడు. స్నేహం స్నేహమే నామినేషన్ నామినేషనే... అని శోభా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది...