నేను మెగా ఫ్యాన్ అంటూ సందీప్ రచ్చ.. ప్రశాంత్ కి కెప్టెన్ గా మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో 40 వ ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర గేమ్స్ జరిగాయి. రెండు గేమ్స్ లో ఆటగాళ్లే విజయం సాధించారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో 40 వ ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర గేమ్స్ జరిగాయి. రెండు గేమ్స్ లో ఆటగాళ్లే విజయం సాధించారు. నిన్నే ప్రశాంత్ కెప్టెన్సీ పీకేసిన బిగ్ బాస్ నేడు.. అతడిపై కనికరం చూపించారు. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అనేవాడు ఎలా నడుచుకోవాలో ఒక గుణపాఠం నేర్పేందుకు నిన్న ఆ నిర్ణయం తీసుకున్నానని.. తిరిగి మళ్ళీ నీకు కెప్టెన్ గా అవకాశం ఇస్తున్నానని బిగ్ బాస్ ప్రశాంత్ కి తెలిపారు.
ఈసారి తన కెప్టెన్సీలో ఎలాంటి లోపం ఉండదని ఈ అవకాశాన్ని వినోయోగించుకుంటానని ప్రశాంత్ బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హౌస్ లో ఎవరు స్మార్ట్ అంటూ ఆటగాళ్లు, పోటుగాళ్ళు మధ్య బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టారు.
బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు రెండు టీమ్స్ నుంచి ఒక్కక్కరు వచ్చి సమాధానం చెప్పాలి. బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు సమాధానం కార్డులపై ఉన్న బొమ్మల్లో ఉంటుంది. సరైన బొమ్మని తీసుకుని బోర్డుపై ఎవరు ముందుగా పెడితే వాళ్ళకి పాయింట్ లభిస్తుంది. ముందుగా బిగ్ బాస్ అఖండ చిత్రంలో బాలయ్య డైలాగ్ వినిపించారు. ఈ చిత్రంలో బాలయ్య ఆయుధం ఏంటి అని అడిగారు.
దీనికి ఆటగాళ్లు టీం సరైన సమాధానం ఇచ్చింది. అలాగే బాహుబలి, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఖుషి చిత్రాల నుంచి కూడా ప్రశ్నలు అడిగారు. ఆట సందీప్ కి ఖుషి చిత్రంలో గజ్జగల్లుమన్నది సాంగ్ లో నటి ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. దీనితో సందీప్ వెంటనే ముంతాజ్ ఫోటోని బోర్డుపై పెట్టారు.
ఇంత కరెక్ట్ గా ఎలా సమాధానం చెప్పావు అని బిగ్ బాస్ అడిగారు. దీనితో సందీప్ నేను పవర్ స్టార్ ఫ్యాన్ బిగ్ బాస్ మెగా ఫ్యాన్స్ ఇక్కడ అని రచ్చ రచ్చ చేశాడు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు టీం విజయం సాధించింది. అనంతరం ఎవరు ఫోకస్డ్ అనే టాస్క్ నిర్వహించారు.
ఈ టాస్క్ లో గాల్లోకి బెలూన్ ని కింద పడకుండా ఎగరేస్తూ తమకి కేటాయించిన రంగుల బంతులని బాస్కెట్ లో నింపాలి. ఈ టాస్క్ లో కూడా ఆటగాళ్లు టీం విజయం సాధించి సంబరాలు చేసుకున్నారు.