ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత..? 8 వారాలకు ఎన్ని లక్షలు ఇచ్చారంటే!


టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న ఆట సందీప్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. 8 వారాలు హౌస్లో ఉన్న సందీప్ రెమ్యూనరేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది. 
 

bigg boss telugu 7 eliminated contestant aata sandeep remuneration for 8 weeks ksr

గత ఏడు వారాలుగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి ఒక్కోవారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. శుభశ్రీ, దామిని, రతిక రోజ్ లలో ఒకరికి రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చారు. హౌస్ మేట్స్ తిరస్కరించిన రతిక రోజ్ కి ఆ అవకాశం దక్కింది. రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్లో తిరిగి అడుగుపెట్టింది. 

ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత ఎనిమిది వారాల్లో మొదటిసారి నామినేట్ అయ్యాడు. పవర్ అస్త్ర గెలిచిన సందీప్ కి 5 వారాల ఇమ్యూనిటీ దక్కింది. ఆరో వారం నామినేట్ కాగా... గౌతమ్ తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుండి తప్పించాడు. 

7వ వారం సందీప్ కి నామినేషన్స్ లో ఒక ఓటు మాత్రమే పడింది. దాంతో నామినేట్ కాలేదు. 8వ వారం మాత్రం సందీప్ నామినేట్ అయ్యాడు. శివాజీ అందరికంటే అత్యధిక ఓట్లు సంపాదించగా... డేంజర్ జోన్లో సందీప్, శోభ ఉన్నారని తెలిసింది. శోభా కంటే సందీప్ స్వల్ప ఓటింగ్ తో ముందున్నాడు. కాబట్టి శోభ ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా సందీప్ పేరు తెరపైకి వచ్చింది. గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్, అశ్విని, శివాజీ, భోలే... ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. 

చివర్లో సందీప్-శోభా మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. సందీప్ ఎలిమినేటైనట్లు నాగార్జున ప్రకటించారు. తేజ, శోభ చాలా బాధపడ్డారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా 8 వారాలకు సందీప్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. సందీప్ వారానికి రూ. 2.5 లక్షలు ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టాడట. ఆ లెక్కన సందీప్ రూ. 20 లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకున్నాడని సమాచారం. ఆట సందీప్ ఫేమ్ కి ఇది చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios