Bigg Boss Telugu 7: ఇల్లు పీకి పందిరి వేసిన హౌస్ మేట్స్... ఇదేం టాస్క్ స్వామి!
బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్క్ లో ఇంటి సభ్యులు నానా హంగామా చేశారు. ఈ టాస్క్ ఆసక్తికరంగా సాగింది.

బిగ్ బాస్ హూ ఈజ్ ది ఫాస్టెస్ట్ టాస్క్ నిర్వహించాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించారు. బిగ్ బాస్ ఒక కలర్ చెబుతాడు. రెండు టీమ్స్ నుండి ఒకరు ఇంట్లోకి పరుగున వెళ్లి ఆ కలర్ లో ఉన్న వస్తువు గార్డెన్ ఏరియాలోకి తీసుకురావాలి. ముందు తెచ్చిన వారికి పాయింట్స్ దక్కుతాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్న కుర్చీలు, మ్యాట్ లు, పెట్టే బేడా మొత్తం తెచ్చారు. ఇల్లు పీకి పందిరి వేశారు. ఈ టాస్క్ లో కూడా అమర్ దీప్ కి బిగ్ బాస్ పంచ్ వేశాడు.
ఇంట్లో ఉన్న పెద్ద గరిట తీసుకురావాలని చెప్పడంతో అమర్ దీప్ చిన్న గరిటె తెచ్చాడు. దాంతో ఆ గరిటతో స్విమ్మింగ్ పూల్ ఖాళీ చేయాలని అమర్ దీప్ కి విచిత్రమైన టాస్క్ పెట్టాడు. చెప్పాలంటే ఈ టాస్క్ కొంచెం సరదాగా సాగింది. హూ ఈజ్ ది ఫాస్టెస్ట్ టాస్క్ లో గెలిచి ఏ టీమ్ ముందుకు వెళ్లారో చూడాలి. కాగా మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా అంబటి అర్జున్, పూజా మూర్తి, నయని పావని, భోలే షావలి, అశ్వినిలను ఇంట్లోకి పంపారు. పాత కొత్త కంటెస్టెంట్స్ తో గేమ్ సరికొత్తగా మారింది.
మరోవైపు పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ కోల్పోయాడు. మెజారిటీ ఇంటి సభ్యులు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా ఫెయిల్ అని ఓటు వేసిన నేపథ్యంలో అతడి కెప్టెన్సీ పదవి పోయింది. కెప్టెన్సీ నుండి తప్పిస్తూ బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ కొనసాగుతుంది. ఇక ఐదు వారాల్లో ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆరవ వారానికి యావర్, అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, నయని పావని, అశ్విని, పూజా మూర్తి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. శోభా, పూజా మూర్తి రేసులో వెనుకబడ్డట్లు సమాచారం.