Bigg Boss Telugu 7: బొక్కలోది ఎవడికీ భయపడను హౌస్ నుండి వెళ్ళిపోతా... మైక్ తీసేసి శివాజీ రచ్చ!
ఫస్ట్ వీక్ లోనే నటుడు శివాజీ అసహనం పీక్స్ కి చేరింది. నేను హౌస్లో ఉండను. తలుపులు తీస్తే వెళ్ళిపోతా అంటూ వీరంగం చేశాడు.

బిగ్ బాస్ తెలుగు 7(Bigg Boss Telugu 7)లో మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది శివాజీనే. సినిమాలు వదిలేసిన శివాజీ రాజకీయ విశ్లేషణలు, ఆరోపణలతో పాప్యులర్ అయ్యాడు. అలాగే పరిశ్రమ ప్రముఖులను ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఓ పెద్ద హీరో ఫాదర్ చనిపోతే చూడటానికి వెళితే.. ఆ హీరో కనీసం నన్ను టచ్ చేయడానికి ఇష్టపడలేదు. దానికి కూడా హోదా ఉండాలని ఫీల్ అయ్యాడంటూ ఇటీవల ఆరోపణలు చేశారు. అలాంటి శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వెళితే ఇంకేముంది.
అనుకున్నదే జరిగింది. జస్ట్ కాఫీ కోసం శివాజీ (Sivaji)బరస్ట్ అయ్యాడు. రేషన్ లో బిగ్ బాస్ కాఫీ పంపలేదు. నాకు కాఫీ కావాల్సిందే అని పట్టుబట్టాడు. బిగ్ బాస్ నన్ను అవమానిస్తున్నాడని ఫైర్ అయ్యాడు. బీపీ టాబ్లెట్ కూడా వేసుకోను నాకు కాఫీ కావాల్సిందే అని డిమాండ్ చేశాడు. బిగ్ బాస్ కాఫీ ఇవ్వకపోవడంతో హౌస్లో ఉండనని చెప్పేశాడు. నేను చాలా మంచి వాడ్ని అంతకు ఐదు రెట్లు చెడ్డవాడిని. బిగ్ బాస్ నా ఇజ్జత్ తీశాడు.
నేను ఎవడినీ లెక్క చేయను. పెద్ద పెద్దోళ్లను చూశాను. పెద్ద పెద్దోళ్ల దగ్గర నుండి వచ్చాను. నేను ఇంట్లో ఉండేది లేదు. ఒక గంటలో వెళ్ళిపోతా అని మైక్ తీసేశాడు. తోటి కంటెస్టెంట్స్ ఎంత నచ్చజెప్పాలని చూసినా శివాజీ వినలేదు. మరి శివాజీ హౌస్లో ఉంటాడా లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
కాగా 14 మంది కంటెస్టెంట్స్ ఉన్న హౌస్లో మొదటి వారం 8 మంది నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, దామిని, ప్రిన్స్ యావర్, షకీలా, శోభిత శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. ఇక ఫేస్ ది బీస్ట్ టాస్క్ లో గెలిచి ప్రియాంక సింగ్, ఆట సందీప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. వీరిద్దరిలో ఒకరు 5 వారాల ఇమ్యూనిటీ గెలుచుకోనున్నారు.