Bigg Boss Telugu 7: యంత్రపు ఎద్దు మీద సవారీ... ఆ కంటెస్టెంట్ కి ప్రమాదం, గాయాలతో కేకలు!
బిగ్ బాస్ హౌస్లో మూడవ కంటెండర్ పోటీ చివరి దశకు చేరుకుంది. ప్రియాంక-శోభా శెట్టి ఫైనల్ కి చేరారు. వీరిలో ఒకరికి పవర్ అస్త్ర దక్కుతుంది. అనూహ్యంగా వీరిలో ఒకరు గాయాల పాలయ్యారు.
మూడవ కంటెండర్ బరిలో ప్రియాంక-శోభా శెట్టి నిలిచారు. బిగ్ బాస్ నిర్ణయం ప్రిన్స్ యావర్ ని దెబ్బతీసింది. అతడు కూడా రేసులో ఉన్న క్రమంలో ముగ్గురిలో ఇద్దరు ఒకరిని వీక్ కంటెస్టెంట్ గా నిర్ణయించి రేసు నుండి తొలగించాలి అన్నారు. దీంతో శోభా, ప్రియాంక కలిసి ప్రిన్స్ యావర్ ని నామినేట్ చేశారు. దాంతో అతడు పవర్ అస్త్ర గెలిచే ఛాన్స్ కోల్పోయాడు. ఈ విషయంలో అతడు చాలా బాధపడ్డాడు. శివాజీ వద్ద చెప్పుకొని ఏడ్చేశాడు.
ప్రిన్స్ యావర్ తప్పుకోవడంతో ప్రియాంక, శోభా మిగిలారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఎవరు గెలిస్తే వారు మూడో కంటెండర్ అవుతారు. యంత్రపు ఎద్దుపై సవారీ అనే టాస్క్ ఇచ్చాడు. యంత్రపు ఎద్దుపై కూర్చొని దాని కుదుపులకు తట్టుకుని ఎవరు ఎక్కువ సమయం ఉంటారో... వారు గెలిచినట్లు అని బిగ్ బాస్ చెప్పాడు. ఇద్దరూ గట్టి ప్రయత్నం చేశారు. అయితే శోభా శెట్టికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఆమె ఎద్దు కుదుపులకు క్రింద పడిపోగా చేతికి గాయమైంది.
శోభ బాధలో ఏడుస్తుంటే కంటెస్టెంట్స్ ఓదార్చారు. ఆమెకు ఎంత పెద్ద గాయం తగిలిందనేది చూడాలి. లేటెస్ట్ ప్రోమోలో ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ఎవరు గెలిచినా మూడు వారాల ఇమ్యూనిటీ దక్కుతుంది. ఈ వారం అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, దామిని ఉన్నారు. ఈ ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.