Bigg Boss Telugu 7: మళ్ళీ పులిహోర స్టార్ట్ చేసిన రతికా, ఈసారి ప్రిన్స్ వంతు... వెన్నుపోటు తప్పదా?
కంటెస్టెంట్ రతికా రోజ్ మళ్ళీ పులిహోర స్టార్ట్ చేసింది. ఈసారి ఆమె టార్గెట్ ప్రిన్స్ యావర్. రొమాంటిక్ గా ఐ లవ్ యూ చెప్పి ముగ్గులోకి దించే ప్రయత్నం చేసింది.

బిగ్ బాస్ హౌస్లో మోస్ట్ డేంజరస్ కంటెస్టెంట్ గా రతికా రోజ్ అవతరిస్తుంది. ఆమె గేమ్ చూసిన ఆడియన్స్ విస్తుపోతున్నారు. పక్కా స్కెచ్ తో హౌస్లో అడుగుపెట్టిందని క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రతి విషయంలో కంటెంట్ క్రియేట్ చేయాలి, కెమెరాలు తననే కవర్ చేయాలని తెలివిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆమె స్ట్రాటజీస్ భయంకరంగా ఉంటున్నాయి. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసింది. తనంతట తానె వెళ్లి అతనితో పులిహోర కలిపింది.
ఈ హౌస్లో నీ హార్ట్ ఎవరికి ఇస్తావ్ అని అడిగింది. దానికి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సిగ్గుపడిపోయాడు. ఇది పెద్ద ప్రశ్నే అన్నాడు. నువ్వు ఎవరికి ఇస్తావ్ అని ఎదురు ప్రశ్నించాడు. దానికి రతికా నీకే అని సమాధానం చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు అంతగా తెలియని పెల్లెటూరి రైతుబిడ్డ మెలికలు తిరిగిపోయాడు. కట్ చేస్తే రెండో వారం నామినేషన్స్ లో ''కుక్కలాగ ఆఫీస్ ల చుట్టూ తిరిగి షోలో ఛాన్స్ దక్కించుకుని, ఇక్కడకు వచ్చి ఏం పీకుతునావ్?'' అని రివర్స్ అయ్యింది. నామినేట్ కూడా చేసింది.
రెండోవారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ఆత్మవిశ్వాసంపై కంటెస్టెంట్స్ దెబ్బతీశారు. హౌస్లో అతడు డల్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ప్రిన్స్ యావర్ ని రతికా టార్గెట్ చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. అతనికి నవ్వుల బాణాలు విసురుతూ... తీపి మాటలతో వలలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. వర్షం పడుతుంటే ఐ లవ్ యూ యావర్ అని గట్టిగా చెప్పింది. మనోడు కూడా మెలికలు తిరుగుతున్నాడు. తిరిగి ఐ లవ్ యూ అని చెప్పాడు.
ఈసారి రతికా టార్గెట్ ప్రిన్స్ అయ్యాడని సోషల్ మీడియా టాక్. అతనికి రతికా వెన్నుపోటు తప్పదంటున్నారు. గత సీజన్లో శ్రీసత్య ఇలాంటి కన్నింగ్ గేమ్ ఆడి చివరి వరకూ వచ్చింది. ఫైనల్ కి మాత్రం వెళ్లలేకపోయింది. అలాగే గీతూ అన్నింట్లో నేనే ఉండాలని ఓవర్ యాక్షన్ చేసి 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. గీతూ, శ్రీసత్యను మిక్స్ చేస్తే రతికా రోజ్ అని చెప్పాలి. మరి ఆవిడ అతి గేమ్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది చూడాలి.