Asianet News TeluguAsianet News Telugu

పొలం గట్ల మీద బీడీలు తాగుతూ కనిపించిన జబర్దస్త్ బ్యూటీ... వీడియో వైరల్!


పొలాల్లో బీడీలు తాగుతున్న రతిక రోజ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. అమ్మడు తీరుకు అందరూ అవాక్కు అవుతున్నారు. 
 

bigg boss telugu 7 contestant rathika rose smoking video getting viral ksr
Author
First Published Jun 10, 2024, 4:12 PM IST

రతికా రోజ్ పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ తెలుగు 7తో ఆమె పాపులారిటీ రాబట్టింది. గతంలో రతిక రోజ్ పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు ఎలాంటి ఫేమ్ రాలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. డిఫరెంట్ షేడ్స్ చూపించి మైండ్ బ్లాక్ చేసింది. హౌస్లో రతిక రోజ్ ప్రవర్తన వివాదాస్పదం అయ్యింది. అవసరానికి తగ్గట్లు ఆమె అభిప్రాయాలు, ఆలోచనలు మారిపోయేవి. 

దారుణమైన నెగిటివిటి మూటగట్టుకున్న రతిక రోజ్ నాలుగు వారాలకే మూటాముల్లె సర్దింది. ప్రేక్షకులు  రిజెక్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ ఆమెకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ గేమ్ కన్ఫ్యుజింగ్ గా సాగింది. సాఫ్ట్ గా ఉండాలా? అగ్రెసివ్ గా ఆడాలా? అనేది ఆమెకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోయింది. 12వ వారం ఆమె ఎలిమినేట్ అయ్యింది. 

బిగ్ బాస్ షో వలన వచ్చిన క్రేజ్ తో రతిక రోజ్ నటిగా ఆఫర్స్ పట్టేస్తుంది. అలాగే బుల్లితెరపై సందడి చేస్తుంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రతిక రోజ్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆమె పొలాల్లో దమ్ము కొడుతూ మాస్ అవతార్ లో దర్శనం ఇచ్చింది. లంగా ఓణీ కట్టి. పొలాల్లో సైకిల్ పై వెళుతూ... బీడీ తాగింది. 

ఇదంతా ఓ రీల్ కోసం చేసింది అమ్మడు. అల్లు అర్జున్-రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ 'సూసేకి' ఇటీవల విడుదలైంది. సదరు సాంగ్ రీల్ లో నటించిన రతిక రోజ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అది కాస్తా వైరల్ గా మారింది. ఫ్యాన్స్ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios