Bigg Boss Telugu 7: చివరికి దొంగతనానికి దిగజారిన కంటెస్టెంట్స్... అందరికీ నిద్ర కరువు!
బిగ్ బోస్ హౌస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవర్ అస్త్ర కోసం కంటెస్టెంట్స్ దొంగలుగా మారుతున్నారు.

బిగ్ బాస్ తెలుగు 7(Bigg Boss Telugu 7)లో ఆసక్తికర పోరు నడుస్తుంది. మాయాస్త్ర గెలుచుకునే ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను రెండుగా విభజించి టాస్క్స్ నిర్వహిస్తున్నారు. రణధీర-మహాబలి టీమ్స్ గా ఇంటి సభ్యులు విడిపోయారు. రణధీర టీమ్లో శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి, షకీలా, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక మహాబలి టీంలో పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, శుభశ్రీ, దామిని, తేజా, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఆల్రెడీ పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు.
మొదటి రౌండ్ లో మహాబలి టీమ్ మీద రణధీర టీమ్ గెలిచింది. దాంతో వారు మాయాస్త్రను చేరుకునేందుకు ఒక కీ గెలుచుకున్నారు. అయితే ఈ తాళాన్ని గెలిచిన టీమ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రత్యర్థి టీమ్ సభ్యులు దొంగిలిస్తే వారికే దక్కుతుందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులకు నిద్ర కరువైంది. రణధీర టీమ్ మెంబర్స్ దాన్ని జాగ్రత్తగా దాచారు. అయినా మహాబలి టీమ్ సభ్యులు కాజేస్తారని భయపడ్డారు.
మహాబలి టీమ్ సభ్యులు మాత్రం వాళ్ళు నిద్రపోతే దొంగిలించాలని రెడీగా ఉన్నారు. లాభం లేదని శివాజీ ఆ తాళాన్ని తన పక్కలో పెట్టుకొని పడుకున్నాడు. శివాజీ నిద్రపోయాక రతికా రోజ్ వెళ్లి దొంగిలించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులకు నిద్రలేకుండా పోయింది. కష్టపడి టాస్క్స్ ఆడి కంటి నిండా నిద్ర కరువైంది.
నేటి ఎపిసోడ్లో మాయాస్త్ర గెలుచుకునేందుకు రణధీర-మహాబలి టీమ్స్ మరలా పోటీపడ్డాయి. మరి గెలుపు ఎవరిని అనేది ఎపిసోడ్ ప్రసారం అయితే తెలుస్తుంది. మాయాస్త్ర గెలుచుకున్న టీమ్ మెంబర్స్ లో ఒకరు పవర్ అస్త్ర గెలవొచ్చు. పవర్ అస్త్ర గెలిచిన కంటెస్టెంట్ కి 5 వారాల ఇమ్యూనిటీ దక్కుతుంది. అలాగే విఐపీ రూమ్ ఇస్తారు. మరికొన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. ఆట సందీప్ ఫస్ట్ పవర్ అస్త్ర గెలిచిన కంటెస్టెంట్ గా ఉన్నాడు.