Bigg Boss Telugu 7: అశ్వని మీద ఫిజికల్ అయిన అర్జున్... అమ్మాయి అని కూడా చూడకుండా!


కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో అంబటి అర్జున్ కొంచెం హద్దులు దాటాడు. అశ్విని మీద ఫిజికల్ అయ్యాడు. గట్టిగా తోసేయడంతో ఆమె కింద పడిపోయింది. 
 

bigg boss telugu 7 ambati arjun throws down aswhini in the task ksr

బిగ్ బాస్ మారథాన్ పేరుతో కెప్టెన్సీ టాస్క్ మొదలుపెట్టారు. ప్రతి టాస్క్ లో గెలిచినవారు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. సదరు టాస్క్ లో అందరికంటే వెనుకబడ్డవారు కంటెండర్ రేసు నుండి తప్పుకుంటారు. మొదటి టాస్క్ లో తేజా, శోభా, ప్రియాంక, అమర్ దీప్ పోటీపడ్డారు. బ్రెయిన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, ఒక్కొక్క వస్తువును సంచాలక్ చూపిస్తూ ఉంటాడు. అది నీటిలో మునుగుతుందో? తేలుతుందో? చెప్పాలి. ఫైవ్ స్టార్ చాకోలెట్ విత్ కవర్, విత్ అవుట్ కవర్, పుచ్చకాయ, వేరు శనక్కాయ, ప్లాస్టిక్ గ్లాస్, ఐస్, కోక్ టిన్  వంటి వస్తువులు మునుగుతాయో లేదో చెప్పాలని ఈ నలుగురిని అడిగారు. ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ సరైన  సమాధానాలు చెప్పి ప్రియాంక గెలిచింది. 

ఇక రెండో టాస్క్ లో మరో నలుగురు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. రంగుల బాక్సులను ఎత్తకుండా ఒక ఆర్డర్ లో అమర్చాలి. ఎవరు ముందుగా అమరుస్తారో వారు విన్నర్. చివరిగా అమర్చిన వాళ్ళు కంటెస్టెంట్ టాస్క్ నుండి తప్పుకుంటారు. ఈ టాస్క్ లో గౌతమ్, యావర్, పల్లవి ప్రశాంత్, రతిక రోజ్ పోటీపడ్డారు. ఇది బుద్ధి తో పాటు బలం ఉపయోగించి గెలవాల్సిన టాస్క్. ఆ రెండు చూపించి కండల వీరులైన గౌతమ్, యావర్ లను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మట్టికరిపించాడు. అందరికంటే ముందు బాక్సులు సక్రమంగా అమర్చి గంట కొట్టాడు. దీంతో ప్రియాంక, ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. 

కెప్టెన్సీ కంటెండర్ రేసులో భాగంగా బిగ్ బాస్ మూడో టాస్క్ గా 'స్టోర్ ఇట్ పోర్ ఇట్' అనే గేమ్ పెట్టాడు. ఈ టాస్క్ లో అర్జున్, సందీప్, అశ్విని, భోలే పాల్గొన్నారు. నలుగురు తలపై నీటిని గ్రహించే స్పాంజిలు ధరించి షవర్ క్రిందకు వెళ్లి నీటిని సేకరించి తమ కంటైనర్ లో నింపాలి. బజర్ మోగే సమయానికి ఎవరు ఎక్కువ నీటిని సేకరిస్తే వారు మూడో కెప్టెన్సీ కంటెండర్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. 

అక్కడ ఒకటే షవర్ ఉన్న నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది. షవర్ క్రింద నిల్చొని నీటిని సేకరించే క్రమంలో ఒకరితో మరొకరు పోటీపడ్డారు. ఈ క్రమంలో అర్జున్ అశ్వినిని తోసేశాడు. ఆమె క్రింద పడింది. శివాజీ వెళ్లి లేపాడు. దీనిపై సందీప్ అసహనం వ్యక్తం చేశాడు. అర్జున్ అందరి మీద ఫిజికల్ అయ్యాడు. అవ్వాలంటే నేను అవ్వనా అన్నాడు. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారనేది ఎపిపోడ్ చూస్తే కానీ తెలియదు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios