Bigg Boss Telugu 7: బిగ్ బాస్ షోకి అమర్ పనికిరాడు... షాకింగ్ విషయాలు బయటపెట్టిన భార్య తేజస్విని! 

సోషల్ మీడియాలో అమర్ పై ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ గమనిస్తున్న అమర్ భార్య తేజస్విని ఆసక్తికర కామెంట్స్ చేసింది. పరోక్షంగా బిగ్ బాస్ షోకి అమర్ దీప్ అన్ ఫిట్ అన్నట్లు చెప్పింది. 

Bigg Boss Telugu 7 amar deep  wife made shocking comments ksr

బిగ్ బాస్ షోలో అమర్ దీప్ పెర్ఫార్మన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. టైటిల్ ఫెవరేట్ అంటుకుంటే టాప్ ఫైవ్ లో కూడా కష్టమే అన్నట్లుగా తయారయ్యాడు. మొదటి నుండి అమర్ దీప్ గేమ్ లో క్లారిటీ మిస్ అయ్యింది. గత ఆరు వారాల్లో ఒక్క అచీవ్మెంట్ లేదు. దానికి తోడు పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. నాగార్జున అమర్ దీప్ గేమ్ పై పూర్తి నిరాశ వ్యక్తం చేశాడు. వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా అమర్ ని టార్గెట్ చేశారు. 

ఆరో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ లో అత్యధికంగా 7 మంది నామినేట్ చేశారు. సోషల్ మీడియాలో అమర్ పై ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ గమనిస్తున్న అమర్ భార్య తేజస్విని ఆసక్తికర కామెంట్స్ చేసింది. పరోక్షంగా బిగ్ బాస్ షోకి అమర్ దీప్ అన్ ఫిట్ అన్నట్లు చెప్పింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... అమర్ దీప్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం. పిల్లలు ఒకసారి మన మాట వింటారో మరోసారి వినరు. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అమర్ దీప్ కి కూడా ప్రతి విషయం అర్థం అయ్యేలా చెప్పాలి. 

అమర్ దీప్ టాస్క్ లలో కష్టపడి ఆడతాడు. మైండ్ గేమ్స్ లో తడబడతాడు. బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్ అర్థం చేసుకుని ఆడలేడు. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాడు. 24 గంటల నుండి ఒక గంట ఫుటేజ్ ప్రసారం చేస్తారు. తప్పుగా మాట్లాడిన విషయాలు చూపిస్తారు. దాని వలన అమర్ దీప్ మీద నెగిటివిటీ ఎక్కువైంది. అమర్ దీప్ బిగ్ బాస్ లో రాణించడం కష్టమే అని నాకు ముందే తెలుసు... అని అన్నారు. 

అమర్ దీప్ కి ఓ ఏడు సూత్రాలు కూడా చెప్పి పంపిందట. ఎక్కువ హైపర్ కావద్దు. అర్థం చేసుకొని స్పందించాలి. ఎక్కడ మాట్లాడుతున్నామో చూసుకోవాలి. ఎవరినీ నమ్మొద్దు... ఇలా ముఖ్యమైన విషయాలు చెప్పి పంపిందట. కానీ అవేమీ అమర్ పాటిస్తున్న సూచనలు లేవు. సీరియల్ నటి తేజస్విని గౌడను అమర్ దీప్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే... 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios