ఇంకోసారి కెప్టెన్ కానివ్వడట... పగబట్టిన అమర్, గెలవడు.. గెలిస్తే ఓర్వలేడు!
మనం గెలవాలని ఆడాలని కానీ ఇంకొకడిని ఓడించాలని ఆడగకూడదు. బిగ్ బాస్ హౌస్లో అమర్ తీరు అలానే ఉంది. ఒకసారి కెప్టెన్ అయినవారిని మరోసారి కానీయను అంటూ శబధం చేస్తున్నాడు...

టాప్ సెలెబ్ హోదాలో హౌస్లో అడుపెట్టిన అమర్ ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకున్నాడు. మనోడు మాటలే కానీ చేతలు ఉండవు. ఎనిమిది వారాల్లో ఒక్క టాస్క్ గెలిచిన పాపాన పోలేదు. ప్రతి గేమ్ లో తన తెలివి తక్కువ తనం బయటపెట్టుకుంటాడు. అటు మైండ్ గేమ్స్,ఇటు ఫిజికల్ గేమ్స్ లో కూడా ఫెయిల్. ఎప్పుడూ పల్లవి ప్రశాంత్ మీద పడి ఏడుస్తాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో నెట్టుకొస్తున్నాడని ఎద్దేవా చేస్తాడు.
పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ ట్యాగ్ వాడినా గేమ్ లో జెమ్ అనిపిస్తున్నాడు. పవర్ అస్త్ర గెలిచాడు. హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. మరోసారి కెప్టెన్సీ కంటెండర్ రేసులో నిలిచాడు. ఇవ్వన్నీ పల్లవి ప్రశాంత్ కష్టపడి ఆడి సాధించినవే. అమర్ కి చెప్పుకోవడానికి ఒక్క అచీవ్మెంట్ లేదు. అమర్ వలె ప్రశాంత్ గేమ్ ఆడితే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవాడు.
8వ వారానికి కెప్టెన్సీ కంటెండర్ రేసులో పల్లవి ప్రశాంత్, గౌతమ్, శోభా, సందీప్, ప్రియాంక ఉన్నారు. వీరిలో ఎవరు కెప్టెన్ అయ్యేది హౌస్ మేట్స్ తేల్చాలి. అర్హత లేదని భావిస్తున్న కంటెండర్ మెడలో మిర్చి మాల వేయాలి. అమర్ అనుకున్నట్లే పల్లవి ప్రశాంత్ మెడలో వేశాడు. నువ్వు నామినేషన్స్ లో లేవు. మిగతా నలుగురు ఉన్నారు. కెప్టెన్ అయితే వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. నేను కెప్టెన్ కాకపోతే వాళ్ళు సేవ్ అవుతారని గ్యారంటీ ఉందా అని ప్రశాంత్ అడిగాడు.
తర్వాత అమర్... ప్రియాంక, గౌతమ్ ఎదుట కెప్టెన్ అయినవాడికి మరలా కానివ్వను అంటూ శబధం చేస్తున్నాడు. అమర్ తాను కెప్టెన్ కావాలని కోరుకోకుండా... ఇంకొకరిని కానివ్వను అంటున్నాడు. ఇలాంటి యాటిట్యూడ్ తో గేమ్ లో ఏమి రాణిస్తాడు చెప్పండి. టైటిల్ ఫెవరేట్ కాస్తా... దిగజారిపోయాడు.