Bigg Boss Telugu 7: రైతుబిడ్డకు మద్దతుగా అఖిల్ సార్థక్... వల్గర్ కామెంట్స్ చేస్తారా అంటూ ఫైర్!
రెండో వారం నామినేషన్స్ లో మెజారిటీ కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. అతన్ని నామినేషన్ చేసిన తీరు నచ్చలేదని బిగ్ బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ అన్నాడు.

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. అతడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి అండగా నిలుచున్నాడు. రెండో వారం నామినేషన్స్ లో రా, పోరా అంటూ పల్లవి ప్రశాంత్ ని వల్గర్ మాట్లాడారని ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. మంగళవారంతో నామినేషన్స్ ముగియగా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు.
పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ కృష్ణ, ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్, తేజా, శివాజీ, షకీలా నామినేట్ చేశారు. అమర్ దీప్ అయితే సింపతీ కోసం ట్రై చేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు. రతికా రోజ్ ఒక్కసారి ఫ్లేట్ ఫిరాయించి హౌస్లో నువ్వేం పీకుతున్నావ్ అని అడిగింది. నామినేషన్ సంగతి ఎలా ఉన్నా ఒరేయ్, ఏరా అంటూ కించపరిచి మాట్లాడటం ఒకింత వ్యతిరేకతకు కారణం అవుతుంది.
ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కి అఖిల్ సార్థక్ మద్దతు తెలిపాడు. ముఖ్యంగా ఏరా, పోరా అని వల్గర్ గా మాట్లాడటం నచ్చలేదన్నాడు. అతడు వేడుకునే షోకి వచ్చి ఉండొచ్చు. తన గేమ్ తాను ఆడుతున్నాడు. అందులో తప్పేంటి. రతికా అయితే మొదట్లో అతన్ని లైన్లో పెట్టాలని చూసింది. అది వర్క్ అవుట్ కాలేదు. నామినేషన్ రోజు కంప్లీట్ గా ఫ్లేట్ ఫిరాయించి బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఏం పీకుతున్నావ్ అన్నది. పల్లవి ప్రశాంత్ ని అలా టార్గెట్ చేయడం నచ్చలేదని అఖిల్ సార్థక్ అభిప్రాయపడ్డారు.