Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: రేవంత్ లో ఆ క్వాలిటీ లేదు... అందుకే నేను బెటర్, జనాలు ఓట్లు వేయాలి

వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. ఆయన ఇద్దరు మిత్రులు రేవంత్, శ్రీహాన్ మధ్య చిచ్చుపెట్టాడు. రేవంత్ బ్యాడ్ క్వాలిటీ చెప్పిన శ్రీహాన్ ఆడియన్స్ అందుకే నాకు ఓట్లు వేయాలని చెప్పుకున్నాడు. 

bigg boss telugu 6 revanth says iam the best than revanth
Author
First Published Dec 10, 2022, 6:45 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 కి ఇది లాస్ట్ వీకెండ్. మరో వారం రోజుల్లో షో ముగియనుంది. మరో వారంలో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. విజేత బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్, ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటాడు. హౌస్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయా ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. మిగతా ఐదుగురు ఫైనల్ కి వెళతారు. 

శనివారం హోస్ట్ నాగార్జున షోని కొంచెం ఎంటర్టైనింగ్ గా నడిపారు. కన్ఫెషన్ రూమ్ లో హారర్ సెటప్ వేసి, చిమ్మ చీకటి చేసి... భయం గొలిపే ఎఫెక్ట్స్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని భయపెట్టాడు. ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య బాగా భయపడ్డారు. కంటెస్టెంట్స్ కన్ఫెషన్ రూమ్ లో భయపడ్డ వీడియోలు నాగార్జున ప్రదర్శించారు. ఆదిరెడ్డి, శ్రీసత్య కన్ఫెషన్ రూమ్ వీడియోలు బాగా నవ్వు తెప్పించాయి. 

వినోదం అనంతరం నాగార్జున కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టాడు. ఇద్దరి చొప్పున పిలుస్తూ... తాము ఎందుకు బెస్ట్ అవతలి కంటెస్టెంట్ ఎందుకు వరస్ట్, జనాలు మీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాలని ఆదేశించాడు. దీనిలో భాగంగా మితృలు రేవంత్-శ్రీహాన్ లను ఎంపిక చేశాడు. రేవంత్ కి కాకుండా ప్రేక్షకులు నీకెందుకు ఓట్లు వేయాలో చెప్పాలని శ్రీహాన్ ని ఆదేశించాడు. 

ప్రతి కంటెస్టెంట్స్ లో లోపాలు ఉంటాయి. అయితే అవి ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. రేవంత్ లో ఆ క్వాలిటీ లేదు. తప్పుని అంగీకరించే గుణం రేవంత్ లో లేదు. కాబట్టి ఆడియన్స్ రేవంత్ కంటే నాకు ఎక్కువగా ఓట్లు వేయాలని శ్రీహాన్ సమర్ధించుకున్నారు. ఈ కామెంట్ కి రేవంత్ మొహం మాడిపోయింది. కోపంలో ఉన్న రేవంత్ ని నాగార్జున మరింత రెచ్చగొట్టాడు. నిన్ను మాటలు మార్చేవాడని శ్రీహాన్ ఆదిరెడ్డితో చెప్పాడన్నాడు. శ్రీహాన్ వెనుక మాట్లాడతాడని నాకు తెలుసంటూ... రేవంత్ అసహనం వ్యక్తం చేశాడు. మొత్తంగా థిక్ ఫ్రెండ్స్ మధ్య నాగార్జున గొడవ రాజేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios