Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: ప్రైజ్ మనీ నాదే అని ఫిక్స్ అయ్యాడా ఏంటి? డబ్బులు కోల్పోయినందుకు శ్రీసత్యపై రేవంత్ ఫైర్!


శ్రీసత్య చేసిన పనికి ప్రైజ్ మనీలో బొక్క పడింది. విన్నర్ నేనే అని డిసైడ్ అయిన రేవంత్ శ్రీసత్యపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. 
 

bigg boss telugu 6 revanth fires on srisatya for loosing prize money
Author
First Published Dec 8, 2022, 3:03 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకున్నా షో పుంజుకున్న దాఖలాలు లేవు. మరింత వరస్ట్ గా తయారైంది అనిపిస్తుంది. 14వ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోల్పోయిన ప్రైజ్ మనీ రికవరీ చేసుకునే వీలు కల్పించాడు. దీని కోసం ఇంటి సభ్యుల మధ్య టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. పోటీలో ఉన్న ఇద్దరు సభ్యులలో విన్నర్ ఎవరు అవుతారని మిగతా ఇంటి సభ్యులు చెప్పాల్సి ఉంటుంది. మెజారిటీ ఇంటి సభ్యులు ఓటేసిన కంటెస్టెంట్ టాస్క్ లో గెలిస్తే... బిగ్ బాస్ ఆ టాస్క్ కి కేటాయించిన అమౌంట్ ప్రైజ్ మనీలో కలుపుతారు. ఆ విధంగా ప్రైజ్ మనీ పెరుగుతుంది.

దీనిలో భాగంగా బిగ్ బాస్ ఒక హారర్ టాస్క్ ఇచ్చారు. కన్ఫెషన్ రూమ్ ని డార్క్ రూమ్ గా మార్చారు. అందులో హారర్ మూవీ సెటప్ వేశారు. చిమ్మ చీకటిగా ఉండే ఆ గదిలోకి కంటెస్టెంట్స్ వెళ్లి బిగ్ బాస్ చెప్పిన వస్తువును వెతికి తేవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆదిరెడ్డిని పంపారు. ఆదిరెడ్డి చాలా భయపడ్డారు. శ్రీహాన్ ని కూడా పంపాలని ఆదిరెడ్డి కోరడంతో బిగ్ బాస్ అతన్ని కూడా లోపలికి పంపాడు. ఇద్దరున్నప్పటికీ బీభత్సంగా భయపడ్డారు. కాసేపటి తర్వాత ఎలాగోలా బిగ్ బాస్ చెప్పిన కాండిల్, గన్ వెతికి బయటకు తీసుకొచ్చారు. 

నెక్స్ట్ ఈ టాస్క్ లో శ్రీసత్య పాల్గొనాల్సి ఉంది. శ్రీసత్య అసలు లోపలికి వెళ్లే సాహసం చేయలేదు. ఎవరో ఒకరు తోడు లేకుండా వెళ్లనంటూ ఖరాఖండీగా చెప్పింది. కాసేపు చూసిన బిగ్ బాస్... తన ఆదేశం పాటించని కారణంగా ఆ టాస్క్ కి కేటాయించిన లక్ష రూపాయలు కట్ చేశాడు. దీంతో రేవంత్ ఫైర్ అయ్యాడు. అనవసరంగా లక్ష రూపాయలు కోల్పోయినట్లు అసహనం వ్యక్తం చేశాడు. 

రేవంత్ తీరు చూస్తే... విన్నర్ ని నేనే, ఆ ప్రైజ్ మనీ నాదే అన్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఇది చూసిన ఆడియన్స్ రేవంత్ మెంటల్ గా ఫిక్స్ అయ్యాడా? లేక బిగ్ బాస్ మేనేజ్మెంట్ నువ్వే విన్నర్ ని చెప్పి హౌస్లోకి పంపారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మగాళ్లు భయపడిన డార్క్ రూమ్ లోకి వెళ్లాలంటే ఒక అమ్మాయిగా శ్రీసత్యకు భయం ఉంటుంది కదా. అది అర్థం చేసుకోకుండా, అక్కడేదో తన డబ్బులతో మిగతా కంటెస్టెంట్స్ ఆడుతున్నట్లు రేవంత్ కోప్పడటం హాస్యాస్పదంగా ఉంది. విన్నర్ ఎవరో అధికారికంగా ప్రకటించే వరకూ ప్రైజ్ మనీపై హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కి సమాన హక్కు ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios