బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల ద్వారా, ట్రాష్ అనే గేమ్ ద్వారా ఆదిత్య, ఇనయా సుల్తానా, అభినయశ్రీ నేరుగా మొదటి వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ తెలుగు 6.. మూడో రోజుకి చేరుకుంది. ప్రారంభం నుంచే ఫైటింగ్‌లు, కోపాలు, అలకలు, ఫైరింగ్‌లతో బిగ్ బాస్ హౌజ్ సాగుతుంది. హౌజ్‌లోని సభ్యుల మధ్య `యాటిట్యూడ్` అనేది మెయిన్ పాయింట్‌గా మారుతుంది. అదే సమయంలో గేమ్స్ కంటే వ్యక్తిగత ఆరోపణలకే ఈ మూడు రోజులు సాగినట్టుగా అనిపిస్తుంది. తాజాగా మూడో రోజు(బుధవారం) ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ ప్రధానంగా సాగింది.
అంతకు ముందే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల ద్వారా, ట్రాష్ అనే గేమ్ ద్వారా ఆదిత్య, ఇనయా సుల్తానా, అభినయశ్రీ నేరుగా మొదటి వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇందులో క్లాస్ సభ్యులను నామినేషన్‌కి దూరంగా ఉంచగా, మిగిలినవారు నామినేషన్‌లో పాల్గొన్నారు. ఇందులో భార్యాభర్తల జంట రోహిత్-మేరీనాకి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. వీరిలో ఒకరిని నామినేట్ చేస్తే, ఇద్దరు నామినేట్ అవుతారని, ఎవిక్ట్ అయితే ఇద్దరూ ఎవిక్ట్(ఎలిమినేషన్) అవుతారని తెలిపారు బిగ్‌బాస్. దీంతో వారికి దిమ్మతిరిగిపోయింది.
అనంతరం నామినేషన్ ప్రక్రియలో రేవంత్.. ఫైమా, ఆరోహిలను నామినేట్ చేశారు. సుదీప రేవంత్‌ని, ఫైమా..రేవంత్, అర్జున్‌లను, వసంతి..రేవంత్ శ్రీ సత్యలను, అర్జున్.. ఫైమా ఆరోహిలన, కీర్తి..రేవంత్, శ్రీహాన్‌లను, ఆరోహి.. రేవంత్, శ్రీ సత్య, రాజ్ శేఖర్.. వసంతి, శ్రీ సత్యలను, సాల్మన్.. శ్రీసత్య, చంటిలను, రోహిత్ జంట.. ఫైమా, చంటిలను, శ్రీహాన్.. రేవంత్, కీర్తిలను, చంటి.. రేవంత్, సుదీపలను, ఆర్జే సూర్య.. రేవంత్, చంటిలను నామినేట్ చేశారు.
వీరిలో అత్యధిక నామినేష్లతో చంటి, శ్రీసత్య, రేవంత్, ఫైమా, ఇనయా, ఆదిత్య ఓం, అభినయశ్రీ నామినేట్ అయ్యారు. అయితే క్లాస్ టీమ్ వాళ్లు ఏకాభిప్రాయంతో నామినేట్ అయిన వారిని కానీ వారితో స్వైప్ చేసే అవకాశం కల్పించారు. దీంతో క్లాస్ టీమ్.. ఆదిత్య ఓం ని ఆరోహితో స్వైప్ చేశారు. దీంతో అదిత్య ఓం మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకున్నారు. ఫైనల్‌గా చంటి, రేవంత్, శ్రీ సత్య, ఆరోహి, ఇనయా, అభినయశ్రీ, ఫైమా మొదటి వారి ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.
నాగార్జున హోస్ట్ గా `బిగ్ బాస్ తెలుగు 6` ఆదివారం ప్రారంభమైన విషయంతెలిసిందే. జంటతో కలిసి 21 మంది కంటెస్టెంట్ ఈ సీజన్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా పాల్గొన్నసీజన్‌గా నిలిచింది. దాదాపు 105 రోజులపాటు ఈ షో రన్ అవుతుందనేవిషయం తెలిసిందే. ప్రతి వారం ఒక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. మొదటి వారం ఎలిమినేషన్‌కి బీజం ఈ రోజుతో పడిందని చెప్పొచ్చు.
