బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. ఫైనల్ కి చేరిన కంటెస్టెంట్స్ మధ్య 'వస్తా మీ వెనుక' గేమ్ పెట్టాడు. ఈ గేమ్ లో ఆదిరెడ్డి-రోహిత్ మధ్య బలప్రయోగం జరిగింది. సంచాలక్ గా ఉన్న రేవంత్ తో పాటు ఆదిరెడ్డి పై రోహిత్ తీవ్ర అసహనం కనబరిచాడు.
బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, ఫైమా, మెరీనా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. శ్రీహాన్ కారణంగా శ్రీసత్యకు చోటు దక్కింది. ఏ ఆరుగురు సభ్యుల మధ్య 'వస్తా నీ వెనుక' అనే గేమ్ కండక్ట్ చేశారు. ఈ గేమ్ లో ఆరుగురు సభ్యులు తమ వీపు భాగంలో నింపి ఉన్న బస్తాలు వేసుకొని సర్కిల్స్ లో నడవాలి. తమ బ్యాగ్ కాపాడుకుంటూ ఇతరుల బ్యాగ్స్ ఖాళీ చేయాలి.
ఈ గేమ్ ఆదిరెడ్డి-రోహిత్ మధ్య తోపులాటకు కారణమైంది. వస్తా నీ వెనుక గేమ్ సంచాలక్ గా రేవంత్ ఉన్నాడు. ఆదిరెడ్డి గేమ్ లో రూల్స్ అతిక్రమించినా రేవంత్ చెప్పలేదని రోహిత్ ఫీల్ అయ్యాడు. వీపున తగిలించుకున్న బ్యాగ్స్ కంటెస్టెంట్స్ పట్టుకోకూడని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఆదిరెడ్డి బ్యాగ్ పట్టుకున్నాడనేది రోహిత్ ఆరోపణ. ఆదిరెడ్డి, ఫైమా రోహిత్ బ్యాగ్ ఖాళీ చేయడంతో ఫస్ట్ టైం ఫైర్ అయ్యాడు.
తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ ని మెరీనా సముదాయించే ప్రయత్నం చేసింది. మరి ఈ వారం కెప్టెన్ ఎవరనేది చూడాలి. మరోవైపు ఈసారి ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్ కొనసాగుతోంది. తొమ్మిది మంది నామినేట్ కాగా ఆదిరెడ్డి, రేవంత్, బాల ఆదిత్య వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం గీతూ ఎలిమినేటైన విషయం తెలిసిందే.
