బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఫస్ట్ కంటెస్టెంట్ గా సీరియల్ నటి కీర్తి భట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె కన్నీటి గాధ వింటే గుండె చలించాల్సిందే 

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు 6 నేడు ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ కంటెస్టెంట్ గా సీరియల్ నటి కీర్తి భట్ వేదికపైకి వచ్చారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కీర్తి, వేదికపై తన జీవితంలో జరిగిన విషాద సంఘటన గుర్తు చేసుకున్నారు. 

గుడికి వెళ్లి వస్తుండగా తల్లిదండ్రులతో పాటు మొత్తం కుటుంబ సభ్యులను ప్రమాదంలో కోల్పోయానని ఆమె ఎమోషనల్ అయ్యారు. కుటుంబంలో తాను ఒక్కదాన్నే మిగిలాను. అయిన వారు నాకు రావాల్సిన ఆస్తి లాక్కొని రోడ్డు మీదకు నెట్టారు. నాలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి నుండి స్వశక్తితో ఎదిగి, ఇప్పుడు మీ ముందుకు, బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చానని కీర్తి చెప్పుకొచ్చారు. 

నీకు జీవితంలో అత్యంత ఇష్టమైనవారు ఎవరని నాగార్జున అడుగగా.... కూతురు అని చెప్పారు కీర్తి . ఓ పాపను నేను దత్తత తీసుకున్నాను. తను చాలా అందంగా ఉంటుంది. తనే నా ప్రపంచం అని చెప్పారు. ఇంకా ఛాలెంజింగ్ గా బతకడం ఎలాగో హౌస్ కి వెళ్లి నేర్చుకుంటాను అన్నారు. అనంతరం కొన్ని కార్డ్స్ తీసుకొచ్చిన నాగార్జున వాటిలో ఒకటి సెలెక్ట్ చేయమన్నారు. కీర్తి వాటి నుండి ఒక కార్ట్ ఎంచుకున్నారు. ఆమె సలెక్ట్ చేసిన కార్ట్ వెనుక వెన్నుపోటు సింబల్ ఉంది. అది తీసుకొని హౌస్ లోకి వెళ్లాలని కీర్తికి నాగార్జున సూచించారు. ఆల్ ది బెస్ట్ చెప్పి సాదరంగా ఆమెను హౌస్లోకి సాగనంపారు.