Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss 6: గీతూ రాయల్‌ చేసిన పనికి జైల్లో పెట్టిన `బిగ్‌ బాస్‌`.. ఆరో సీజన్‌ ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్య..

బిగ్‌ బాస్‌ తెలుగు 6, ఐదో వారం ఎపిసోడ్‌ ఆద్యంతం హాట్ హాట్‌గా సాగింది. చెత్త ప్రదర్శన ఇచ్చిన వారికి ఓట్లు వేసే క్రమంలో ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాలు, గొడవలు పీక్‌లోకి వెళ్లడం విశేషం.

bigg boss telugu 6 first captain baladitya and geetu royal sent to jail by bigg boss 5th day highlights
Author
First Published Sep 9, 2022, 11:40 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 6(Bigg Boss Telugu 6) షో ఐదో రోజుకి చేరుకుంది. శుక్రవారం షోలో ప్రధానంగా హౌజ్‌లో మొదటి కెప్టెన్‌ ఎంపిక జరిగింది. అనంతరం వరస్ట్ పర్‌ఫెర్మర్‌ ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం హాట్ హాట్‌గా సాగింది. చెత్త ప్రదర్శన ఇచ్చిన వారికి ఓట్లు వేసే క్రమంలో ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాలు, గొడవలు పీక్‌లోకి వెళ్లడం విశేషం. ఇదే ఈ రోజు హైలైట్‌గా నిలిచింది. 

ఇందులో మొదటగా చెప్పాల్సి వస్తే.. బాలాదిత్య(Baladitya), గీతూ రాయల్‌(Geetu Royal), వసంత గార్డెన్‌ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటుండగా, గీతూ రాయల్ కాలు మీద కాలేసుకుని ఊపుతూ యాటిట్యూడ్‌ చూపించడంతో బాలాదిత్య తన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలా చేయోద్దని చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా, అది తన అలవాటని, కాలు ఊపడం ఆపుకోలేనని చెప్పింది గీతూ. అయినా చూడ్డానికి బాగోదని, ఇంకోలా అర్థం చేసుకుంటారని చెప్పారు. రాత్రి పడుకునే సమయంలోనూ ఆమె ప్రవర్తన ఇబ్బందిగా అనిపించడం విశేషం. 

ఇక మొదటి వారం కోసం బిగ్‌ బాస్‌ (BB6)కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. `కెప్టెన్సీ బండి` అనే పేరుతో టాస్క్ ఇచ్చింది. ఇందులో వాటర్‌లో కీస్‌ ఉంటాయి. అందులో తలముంచి నోటితో ఆ కీస్‌ తీసుకుని పక్కనే ఉన్న బాక్స్ ని ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్ లో ఉన్న కారు నెంబర్‌ని, మరో టబ్‌లో ఉన్న నెంబర్స్ వెతికి తనకు కేటాయించిన కారు నెంబర్‌ని సరైన విధంగా అమర్చాల్సి ఉంటుంది.  దీనికి ఫైమా సంచాలక్‌గా వ్యవహరించారు.

ఈ టాస్క్ లో గీతూ రాయల్‌ ముందుగా తన టాస్క్ ని పూర్తి చేసింది. ఆ తర్వాత బాలాదిత్య పూర్తి చేశాడు. కానీ గీతూ తప్పుడు దోరణిలో గేమ్‌ ఆడినందుకుగానూ ఆమె గేమ్‌ చెల్లదని తీర్పునిచ్చింది ఫైమా. దీంతో బాలాదిత్య విన్నర్‌గా నిలిచారు. మొదటి వారం కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన్ని సభ్యులతో పలు కామెడీ పంచ్‌లతో ఆహ్వానం పలుకుతూ కెప్టెన్‌ సీట్లో కూర్చోబెట్టారు.

ఈ టాస్క్ విషయంలో సభ్యులకు, గీతూకి వాగ్వాదం జరిగింది. గీతూ గేమ్‌ ఆడే క్రమంలో నెంబర్స్ ని ఆమె తన టీషర్ట్ లోపల దాచుకోవడం పట్ల ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనికి ఆమె స్పందిస్తూ, ఇది తన స్ట్రాటజీ అంటూ ఫైర్‌ అయ్యింది. నాకు నచ్చినట్టు ఆడతానని, ఎవరైనా చేయి పెట్టి తీసుకున్నా, నేను అభ్యంతరం తెలపనని చెప్పడం గమనార్హం. కానీ మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. చివరికి అదే కారణంగా ఆమెని చాలా మంది సభ్యులు వరస్ట్ ఫర్‌ఫార్మర్‌గా నామినేట్‌ చేయడం గమనార్హం. 

ఇక చివరగా ఈ వారం వరస్ట్ పర్‌ ఫార్మర్‌గా ఎన్నుకోవాల్సి ఉండగా, దాదాపు 15కిపైగా ఓట్లతో గీతూ రాయల్‌ మొదటి వారం వరస్ట్ పర్‌ఫార్మర్‌గా నిలిచారు. ఈ వారంలో ఆమె ప్రవర్తన పట్ల మొదట్నుంచి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాటిట్యూడ్‌ బాగా లేదని, టాస్క్ లో ఆడిన విధానం పట్ల వారంతా అభ్యంతరం తెలియజేస్తూ, ఆమెకి వరస్ట్ పర్‌ఫార్మెర్‌గా స్టాంప్‌ వేశారు. అయితే ఇందులో ఇనయ సుల్తానా, శ్రీహాన్‌ మధ్యజరిగిన కన్వర్జేషన్‌ పెద్ద దుమారం రేపింది. 

శ్రీహాన్‌కి మధ్య కన్వర్జేషన్‌లో నోరు జారింది ఇనయ. ఆమె ఆవేశంలో మాట్లాడుతూ, `నేను సింగిల్‌గా వచ్చాను, నాకు ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి నేను చేస్తున్నానిక్కడ. నేను ఎగ్జైట్‌ అవుతాను, సెల్ఫ్‌గా అప్పీల్‌ కూడా చేసుకుంటాన`ని చెప్పింది. అంతేకాదు శ్రీహాన్‌కి సంబంధించిన పర్సనల్‌ విషయాల్లోకి వెళ్లింది ఇనయ. `నీకు సిరి ఉంది, ఇంకా ఎవరెవరో ఉన్నారు బయట` అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి శ్రీహాన్‌ వార్నింగ్‌ ఇవ్వడం విశేషం. బయటి విషయాలు మాట్లాడొద్దని ఆమెని హెచ్చరించారు. ఈ వాదనతో హౌజ్‌ మొత్తం హీటెక్కింది. మొత్తానికి గీతూ రాయల్‌ని వరస్ట్ పర్‌ఫార్మర్‌గా తేల్చారు. దీంతో ఆమెని జైల్లో పెట్టారు. రేపు నాగార్జున ఎంట్రీ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్‌ ఆసక్తిని క్రియేట్‌ చేయబోతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios