బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ గేమ్ నడుస్తుంది. కంటెస్టెంట్స్ కి కుటుంబ సభ్యులను గుర్తు చేసి ఏడిపించేస్తున్నాడు. వాళ్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కాగా కంటెస్టెంట్ రోహిత్ అతిపెద్ద త్యాగం చేశారు.
బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా 'బ్యాటరీ ఛార్జ్' గేమ్ ఆడుతున్నాడు.గార్డెన్ ఏరియాలో బ్యాటరీ ఏర్పాటు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆప్షన్స్ ఆధారంగా ఛార్జ్ తగ్గుతుందని చెప్పాడు. అంటే కుటుంబ సభ్యులతో వీడియో లేదా ఆడియో కాల్ మాట్లాడాలంటే ఎక్కువ శాతం బ్యాటరీ ఖర్చు అవుతుంది. బ్యాటరీ జీరో అయితే గేమ్ ఆగిపోతుంది. మిగిలిన కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కోల్పోతారు. నిన్న ఎపిసోడ్ లో బాల ఆదిత్య బ్యాటరీ జీరో చేసేశాడు.
ఆయన భార్యతో ఆడియో కాల్ మాట్లాడాలనే ఆప్షన్ ఎంచుకున్నారు. దీనికి మిగిలి ఉన్న 50 శాతం బ్యాటరీ ఖర్చు అయ్యింది. బ్యాటరీ జీరో కావడంతో ఇక తమకు అవకాశం లేదని మిగతా కంటెస్టెంట్స్ నొచ్చుకున్నారు. బాల ఆదిత్య ఫోన్లో భార్యతో మాట్లాడారు. అయితే బిగ్ బాస్ గేమ్ కొనసాగించడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఈ వారం ఎలిమినేషన్స్ లో లేని వాసంతి, రోహిత్ లలో ఒకరు నేరుగా రెండు వారాలు నామినేటైన పక్షంలో బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేస్తా అన్నారు.
వాసంతి, రోహిత్ లలో ఎవరో ఒకరు ఒప్పుకుంటేనే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మిగతా కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యులను చూసే, మాట్లాడే వీలుంటుంది. కంటెస్టెంట్స్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకొని రోహిత్ నామినేట్ కావడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఆయన రెండు వారాలు నామినేషన్స్ లో ఉంటారు. రోహిత్ నిర్ణయంతో కంటెస్టెంట్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే అవకాశం దక్కింది.
ఇది నిజంగా పెద్ద త్యాగమే అని చెప్పాలి. ఈ వారం ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, మెరీనా శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, రాజశేఖర్ నామినేషన్స్ లో ఉన్నారు. రోహిత్ కూడా నామినేట్ కావడంతో పది మంది సభ్యులు అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు.
