Bigg boss telugu 5: ఈ వారం హౌస్ నుండి ఆ ఇద్దరిలో ఒకరు అవుట్!
ఈవారం Eliminations లో రవి, లోబో, శ్రీరామ్, ప్రియ, కాజల్, జస్వంత్, అని మాస్టర్ ఉన్నారు. వీరి నుండి హౌస్ వీడే ఛాన్స్ వాళ్ళిద్దరిలో ఒకరంటూ ప్రచారం సాగుతుంది.
Bigg boss షో ఆరువారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ నుండి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ లతో పాటు శ్వేత ఎలిమినేట్ అయ్యారు. మరి ఏడవవారం ఎలిమినేట్ ఎవరు కానున్నారనే చర్చ అప్పుడే మొదలైపోయింది.
ఈవారం Eliminations లో రవి, లోబో, శ్రీరామ్, ప్రియ, కాజల్, జస్వంత్, అని మాస్టర్ ఉన్నారు. వీరి నుండి హౌస్ వీడే ఛాన్స్ వాళ్ళిద్దరిలో ఒకరంటూ ప్రచారం సాగుతుంది. Priya ఈ వారం హౌస్ నుండి సర్దివేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఆమె గేమ్ తీరు ప్రేక్షకులలో నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పరిచింది. లహరి, రవి విషయంలో ఆమె చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. లహరి ఎలిమినేట్ అయిన వారమే ప్రియ ఎలిమినేట్ కావాల్సి ఉందన్న మాట వినిపించింది.
Also read సోహైల్-అరియానాలను మించిపోతున్న సన్నీ-ప్రియాల ఫైటింగ్.. చెంప పగలగొడతానంటూ వార్నింగ్..
ఇక ఎన్నో అంచనాల మధ్య హౌస్ లోకి వెళ్లిన లోబో పెర్ఫార్మన్స్ కూడా అనుకున్న స్థాయిలో లేదు. గత వారం ఎలిమినేట్ చేసినట్లు జర్క్ ఇచ్చి సీక్రెట్ రూమ్ కి Lobo ను పంపారు. ఇక లోబో వైఫ్ కూడా గర్భవతి అని తెలుస్తుంది. అందుకే బిగ్ బాస్ హౌస్ నుండి నెక్స్ట్ వీక్ ప్రియ, లోబో లలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు.
Also read విహారి చెప్పిన నిజం.. కార్తీక్ కుటుంబంపై మరింత అసహ్యం పెంచుకున్న హిమ, సౌర్య?
ఇక ఈ సీజన్ మొత్తం ఎలిమినేషన్స్ ముందుగా ప్రచారం అయినట్లే జరిగాయి. దీనితో తాజా అంచనాలు కూడా నిజమయ్యే అవకాశాలు కలవు.బిగ్ బాస్ హౌస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన నేపథ్యంలో ఈజీగా బిగ్ బాస్ విషయాలు బయటికి వస్తున్నాయి. మరోవైపు బిగ్ బాస్ షో టీఆర్పీ దారుణంగా ఉన్నట్లు సమాచారం. షో అనుకున్నంతగా ఆకట్టుకోక పోవడంతో పాటు, మిగతా ఈవెంట్స్ నుండి గట్టిపోటీ ఎదురుకావడం సమస్యగా మారింది. తాజాగా వరల్డ్ టి 20 ఈవెంట్ మొదలు కావడం ఈ షోని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లయ్యింది.