బిగ్ బాస్ షోకి వెళ్లే ముందు కంటెస్టెంట్స్ చేత కొన్ని అగ్రిమెంట్స్ పై సంతకాలు చేయించుకుంటారు నిర్వాహకులు. అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనల ప్రకారం కంటెస్టెంట్స్ నడుచుకోవాలి. ఎలిమినేటై బయటికి వచ్చాక కూడా వాళ్ళపై కొన్ని ఆంక్షలు ఉంటాయి.
బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss Telugu5) చివరి ఎలిమినేషన్ ద్వారా కాజల్ హౌస్ నుండి బయటకొచ్చిన విషయం తెలిసిందే. టాప్ సిక్స్ వరకు వెళ్లిన కాజల్.. ఫైనల్స్ కి ముందు హౌస్ ను వీడారు. అయితే కాజల్ కీలకమైన ఓ నిబంధనను అతిక్రమించి, బిగ్ బాస్ నిర్వాహకుల కోపానికి కారణం అయ్యారట. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ షోకి వెళ్లే ముందు కంటెస్టెంట్స్ చేత కొన్ని అగ్రిమెంట్స్ పై సంతకాలు చేయించుకుంటారు నిర్వాహకులు. అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనల ప్రకారం కంటెస్టెంట్స్ నడుచుకోవాలి. ఎలిమినేటై బయటికి వచ్చాక కూడా వాళ్ళపై కొన్ని ఆంక్షలు ఉంటాయి. హౌస్ నుండి ఎలిమినేటై బయటికి వచ్చిన వెంటనే ఎటువంటి ఇంటర్వ్యూలలో పాల్గొనకూడదు, అనేది నిబంధనల్లో ఒకటి. బిగ్ బాస్ బజ్ ఫుల్ ఇంటర్వ్యూ ప్రసారం అయ్యే వరకు ఇతర చానల్స్ ఇంటర్వ్యూలలో పాల్గొనకూడదు.
హౌస్ నుండి వచ్చాక ప్రతి కంటెస్టెంట్ తమ అనుభవాలు, అభిప్రాయాలు బిగ్ బాస్ షోకి అనుసంధానంగా ఉన్న బిగ్ బాస్ బజ్ లో వెల్లడించాలి. బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా అరియానా గ్లోరీ వ్యవహరిస్తున్నారు. కాగా కాజల్ (RJ Kajal)ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే దీని తాలూకు ఫుల్ ఎపిసోడ్ స్టార్ మాలో ప్రసారం కాకమునుపే కాజల్.. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారట. ఈ విషయంలో కాజల్ పై నిర్వాహకులు సీరియస్ అయ్యారట. ఆమెను గట్టిగా మందలించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also read Bigg boss Telugu 5: అనూహ్యంగా టాప్ కంటెస్టెంట్స్ అవుట్... ఫైనల్ కి చేరిన 5 కంటెస్టెంట్స్ వీరే
హౌస్ లో కూడా కాజల్ ఇలాంటి తత్త్వమే ప్రదర్శించారు. హోస్ట్ నాగార్జున (Nagarjuna) ముందు అనేక సార్లు తన ఆత్రం చూపించారు. వేరే కంటెస్టెంట్ ని అడిగిన ప్రశ్నకు తాను ఆన్సర్ ఇవ్వడం, ఇతరుల గొడవల సమయంలో తనని అడగకపోయినా... ఒక సైడ్ తీసుకొని వివరణ ఇవ్వడం చేసేది. అదే తరహా బిహేవియర్ ఇక్కడ కూడా చూపించారట. ఎలిమినేషన్స్ ముందుగానే తెలిసిపోతున్నాయనే అసహనంలో ఉన్న నిర్వాహకులకు కాజల్ చర్యలు పుండు మీద కారం చల్లినట్టు అయ్యిందట. మరి ఈ కథనాలపై కాజల్ ఏ విధంగా స్పందిస్తారో.. ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
Also read BIG BOSS5: ; పింకీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన ప్రియ
