Asianet News TeluguAsianet News Telugu

BIG BOSS5: ; పింకీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన ప్రియ

కొన్ని వారాల గ్యాప్ తో ప్రియ.. ప్రియాంక ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకెంతో ఇష్టమైన పింకీ కోసం కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది ప్రియ. 
 

priya diamond ring gift to priyanka singh
Author
Hyderabad, First Published Dec 13, 2021, 10:28 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ప్రియ-ప్రియాంక సింగ్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నన్ని రోజులు ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా.. ఇద్దరూ తట్టుకోలేకపోయేవారు. ఒక రకంగా అక్క- చెల్లెలుగా ఉన్నా.. తల్లి-బిడ్డల అనుబంధం వారిలో కనిపించేది. ప్రియ బిగ్ బాస్ హౌజ్ ను వీడినప్పుడు కూడా ప్రియాంక చెప్పలేనంతగా ఏడ్చింది.. ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. అంతే కాదు ప్రియ వెళ్లిపోయిన తరువాత ప్రియాంక సెట్ అవ్వడానికి కూడా చాలా టైమ్ పట్టింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా వీరి బంధం ఇలానే కంటీన్యూ అవుతూ.. ఉంది.


బిగ్ బాస్ నుంచి వారం క్రితం బయటకు వచ్చింది ప్రియాంక 13 వారాలు హౌస్ లో ఉండి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమెకు గ్రాండ్ వెల్కం లభించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన మెంబర్స్ తో పాటు.. ప్రియాంక అభిమానులకు కూడా  ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇక ప్రియ అయితే ప్రియాంక కోసం ఏకంగా డైమెండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని రీసెంట్ గా తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేసింది ప్రియాంక సింగ్ 


 
డైమండ్ రింగ్ ఫోటోను పోస్ట్ చేసిన పింకీ.. ఇది నేను ఊహించలేదు.. థాంక్ యూ అక్కా.. లవ్ యూ.. అంటూ పోస్ట్ పెట్టింది. ప్రియ అక్క మనసు వెన్నెలాంటిది. తనను అక్కా అని పిలిచినా.. తనలో అమ్మను చూసుకున్నానంటోంది పింకీ. తన కోసం దుబాయ్ నుంచి గిఫ్ట్ గా వచ్చిన డైమండ్ రింగ్ ను నాకు ఇచ్చేసింది. నీకే ఇది బాగుంటుంది అన్నది. నిజానికి ప్రియ అక్కే నాకు పెద్ద డైమండ్ అంటూ తమ మధ్య అనుబంధాన్ని వివరించింది ప్రియాంక సింగ్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios