Bigg Boss Telugu 5 TRP: గ్రాండ్ ఫినాలేకి అదిరిపోయే టీఆర్పీ నమోదు.. కానీ
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ లో ప్రారంభం బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయింది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ లో ప్రారంభం బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయింది. 100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులని ఈ షో అలరించింది. షణ్ముఖ్, సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్ చివరి రోజు వరకు హౌస్ లో కొనసాగారు.
సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కు చేరగా.. సన్నీని విజయం వరించింది. దీనితో సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచాడు. సినీతారల డాన్స్ పెర్ఫామెన్స్,నాగ చైతన్య, నాని, రాజమౌళి, అలియా భట్ లాంటి అతిథుల సందడితో గ్రాండ్ ఫినాలే రసవత్తరంగా సాగింది.
గ్రాండ్ ఫినాలే అంటే టిఆర్పి రేటింగులు రికార్డ్ స్థాయిలో నమోదవుతాయి. అంచనాలకు తగ్గట్లుగానే తెలుగు ప్రేక్షకులంతా ఆరోజు టీవీలకు అతుక్కుపోయారు. దీనితో బిగ్ బాస్ తెలుగు 5 కి అదిరిపోయే టిఆర్పి నమోదైంది. గ్రాండ్ ఫినాలేకి 18.4 టిఆర్పి నమోదు కావడం విశేషం. దీనికి తోడు హాట్ స్టార్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదయ్యాయి.
గ్రాండ్ ఫినాలేని ఏకంగా 4. 5 గంటలు ప్రసారం చేశారు. మొత్తం 6.2 కోట్ల మంది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ని వీక్షించారు. బిగ్ బాస్ క్రేజ్ అలాంటిది. బిగ్ బాస్ 5కి నమోదైన టిఆర్పి అదుర్స్ అనే చెప్పాలి. కానీ గత సీజన్ ని బీట్ చేయడంలో విఫలం అయింది. బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే కి రికార్డు స్థాయిలో 19.5 టిఆర్పి రేటింగ్ నమోదు కావడం విశేషం. గత సీజన్ కంటే ఈ సీజన్ కాస్త వెనుకబడింది.
తొలి సీజన్ కు ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. తొలి సీజన్ ఫినాలే కి 14.1.. రెండవ సీజన్ కు 15.05.. మూడవ సీజన్ కు 18.2.. నాల్గవ సీజన్ కు 19. 5.. ఐదవ సీజన్ కు 18.4 టిఆర్పి నమోదయ్యాయి.
Also Read: Samantha: సమంత జోరు ముందు నిలబడలేకపోయిన బోల్డ్ బ్యూటీ