మరో మూడు వారాలలో బిగ్ బాస్ సీజన్ 4 ముగియనుండగా, కంటెస్టెంట్స్ మధ్య యుద్ధం ఆసక్తికరంగా మారింది. రేస్ టు ఫినాలే టికెట్ ని బిగ్ బాస్ సిద్ధం చేశారు. టాస్క్ లో గెలిచిన కంటెస్టెంట్ రేస్ టు ఫినాలే మెడల్ గెలుచుకొని నేరుగా ఫైనల్ వీక్ వెళ్లే అవకాశం పొందవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. దీని కోసం గార్డెన్ ఏరియాలో ఉంచిన ఆవు బొమ్మ నుండి పాలు సేకరించాలని బిగ్ బాస్ సభ్యులను ఆదేశించాడు. 

పాలను సేకరించడం కోసం యుద్ధం మొదలైంది. బజర్ మోగగానే అందరూ మిల్క్ క్యాన్స్ తో ఆవుదగ్గరికి పరుగెత్తారు. ఇరుకుగా ఉన్న ఆవు పాల పొదుగు దగ్గర ఇంటి సభ్యులు తోపులాటకు దిగారు. ఎలాగైనా అందరికంటే ఎక్కువ పాలు సేకరించాలనే తాపత్రయంలో ఒకరిని మరొకరు తిట్టుకున్నారు. ఈ క్రమంలో అవినాష్ మరియు సోహైల్ మధ్య వాగ్వాదం నడించింది. సోహైల్ తో కలిసి అఖిల్ కూడా అవినాష్ పై గొడవ పెట్టుకోవడంతో అందరూ ఒక్కటై పోయారని అవినాష్ ఆరోపించాడు. 

ఎలాగైనా ఎక్కువ పాలు సంపాదించిన రేస్ టు ఫినాలే టికెట్ పట్టేస్తా అని సోహైల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం జరిగింది. ఈ టాస్క్ లో అఖిల్, సోహైల్ కలిసి ఆడుతున్నారని అభిజిత్ విమర్శించారు. అందులో తప్పేమీ లేదని అఖిల్ సమర్ధించుకున్నారు. నేడు ప్రసారం కానున్న బిగ్ బాస్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. రేస్ టు ఫినాలే టికెట్ ఎవరు సంపాదిస్తారో అన్న ఉత్సుకత అందరిలో మొదలైంది.