గత సీజన్‌లతో పోలిస్తే కాస్త జోష్ తగ్గినా నాలుగో సీజన్‌ కూడా బిగ్‌ బాస్ సరదాగా సాగుతోంది. ఇప్పటికే ఎలిమిలేషన్ కూడా స్టార్ట్‌ అయ్యింది. తొలి వారం హౌస్‌ నుంచి దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్‌ అయ్యారు. అయితే వెంటనే కమెడియన్‌ కుమార్ సాయిని హౌస్‌లోకి పంపటంతో మళ్లీ హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్‌లు ఉన్నారు. సోమవారం సెకండ్ వీక్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలువుతోంది.

అందుకు సంబంధించి ప్రోమోను వదిలారు బిగ్ బాస్‌ టీం. గత వారం కనెక్షన్స్‌ లో ఉన్న ప్రతీ ఇద్దరి కంటెస్టెంట్‌లో ఒకరిని ఎలిమినేషన్‌కు ఎంపిక చేయమని హౌస్‌మెట్స్‌కు సూచించిన బిగ్ బాస్‌, ఈ సారి మరింత ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేశాడు. అందరినీ హౌస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో ఎక్కమని తరువాత ఒక్కొక్కరుగా దిగిపోవాలని అలా దిగిపోయిన వాళ్లు నామినేట్‌ అయినట్టుగా తెలిపాడు.

దీంతో ఇంటి సభ్యులు తమకు తాముగా నామినేట్‌ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నోయల్‌, గంగవ్వలు తమకు తాముగా నామినేట్‌ అయ్యేందుకు రెడీ అయినట్టుగా ట్రైలర్‌లో చూపించారు. మరి ఈ గేమ్‌లో ఎవరు నామినేట్‌ అయ్యారు. ఎవరు నామినేషన్‌ నుంచి తప్పించుకున్నారు. ఈ గేమ్‌ బిగ్‌ బాస్‌ పెట్టిన ఇతర కండిషన్లు ఏంటి..? అన్నది ఈ రోజు షో చూసి తెలుసుకోవాల్సిందే.