బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారం ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. గతవారం షో సాగిన విధానానికి బిగ్ బాస్ అభిమానులు కాస్త ఫీల్ అయ్యారు షో రోజు రోజులు బోరింగ్ గా మారుతోంది అంటూ పెదవి విరిచారు. కానీ ఈ వారం మాత్రం ఆసక్తికరమైన టాస్క్ లతో కంటెస్టెంట్స్ అలరిస్తున్నారు. బుధవారం రోజు జరిగిన ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. 

బాబా భాస్కర్, శ్రీముఖిని న్యాయ నిర్ణేతలుగా ప్రకటిస్తూ ఆడిషన్స్ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో పునర్నవి, అషు వేసిన స్టెప్పులు ఆడియన్స్ ని బాగా అలరించాయి. పునర్నవి 'నాపేరు సూర్య' చిత్రంలోని పిల్లగా నువ్వ్వు ఇరగ ఇరగ అనే పాటకు లయ బద్దంగా స్టెప్పులేసింది. ఎప్పుడూ బద్దకంగా కనిపించే అషురెడ్డి రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఆశ్చ్యర్య పరిచింది. 

ఇక శివజ్యోతి చేసిన మ్యాజిక్ షోపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఆమెపై రకరకాల మీమ్స్ తో ఆడియన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. అగ్గి పెట్టెలోకి చీరని పట్టిస్తానంటూ శివజ్యోతి చేసిన మ్యాజిక్ నవ్వులు పూయించింది. ఆమె చేసిన షోకు బాబా భాస్కర్ ఇచ్చిన రియాక్షన్స్ హైలైట్. 

ప్రొఫెషనల్ సింగర్ అయినా రాహుల్ తడబడ్డాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గట్టి పోటీనిచ్చే సత్తా ఉన్నా రాహుల్ పాల్గొనడం లేదు. అతడి పెర్ఫామెన్స్ రోజు రోజుకు దారుణంగా తయారవుతోందంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.