బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న బిగ్ బాస్ షో మూడవ సీజన్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గత రెండు సీజన్ లని మించేలా బిగ్ బాస్ 3 ఉండబోతోంది. కింగ్ నాగార్జున ఈ సారి హోస్ట్ గా వ్యవహరించనుండడం విశేషం. అనేక వివాదాలు నెలకొని ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు తెరపడే సమయం వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాం.. 

 

వరుణ్ సందేశ్ దంపతులు : 'కొత్త బంగారు లోకం' చిత్రంలో పాటకు డాన్స్ చేస్తూ వరుణ్ సందేశ్, అతడి సతీమణి వితిక షెరు వేదికపైకి వచ్చేశారు. వీరిద్దరూ చేస్తున్న రొమాంటిక్ డాన్స్ ఆకట్టుకుంటోంది. వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ డేస్ చిత్రం తనకు చాలా ఇష్టం అని నాగార్జున తెలిపారు. వితిక షెరు నాగార్జునకు తమ ప్రేమ గురించి తెలిపింది. షోలో అందరూ ఎలిమినేట్ అయి మీరు ఇద్దరూ మిగిలితే ఏంటి పరిస్థితి అని నాగార్జున సరదాగా అడిగాడు. వితిక, వరుణ్ ఎవరికీ వారు తానే గెలవాలని కోరుకుంటామని తెలిపారు. వితికని ఎత్తుకుని వరుణ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. 

శ్రీముఖి : టాప్ యాంకర్ శ్రీముఖి ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని సాంగ్ కు అదిరిపోయే డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి గ్లామర్ లుక్ లో అదరగొడుతోంది. శ్రీముఖి చాలా అందంగా ఉందంటూ నాగార్జున పొగడ్తలు కురిపిస్తున్నాడు. శ్రీముఖి తన ఫ్యామిలీని నాగార్జునకు పరిచయం చేసింది. నాగార్జునని ఆప్యాయంగా హగ్ చేసుకున్న తర్వాత శ్రీముఖి హౌస్ లోకి ఎంటర్ అయిపోయింది. 

ఫన్ బకెట్ మహేష్ : యూట్యూబ్ లో ఫన్ బకెట్ తో పాపులర్ అయిన మహేష్ గురించి చూపిస్తున్నారు. పంచె కట్టులో మహేష్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. మహేష్ ఫ్యామిలీ కూడా షోకు హాజరయ్యారు. మహేష్ నాగార్జునకు తమాషా పదాలు చెబుతున్నాడు. మహేష్ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించాడు. 

అలీ రెజా: టివి నటుడు అలీ రెజా సూపర్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రంలోని టైటిల్ సాంగ్ కు డాన్స్ చేశాడు. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ షోకి వచ్చినట్లు అలీ రెజా తెలిపాడు. 

నటి హేమ : ప్రముఖ నటి హేమ ట్రెండీ డ్రెస్ లో సింపుల్ గా వేదికపైకి వచ్చేసింది. తాను సినిమాల్లో నటిస్తానని.. నిజజీవితంలో నిజాయతీగా ఉంటానని హేమ నాగార్జునతో తెలిపింది. తాను వంటలు బాగా వండుతానని కూడా తెలిపింది. 

పునర్నవి భూపాలం: ఉయ్యాలా జంపాల ఫేమ్ పునర్నవి ఓ బేబీ చిత్ర టైటిల్ సాంగ్ కు డాన్స్ చేస్తూ వేదికపైకి వచ్చేసింది. నాగార్జునతో సరదా సంభాషణ తర్వాత పునర్నవి హౌస్ లోకి ఎంటర్ అయింది. 

కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ : అదిరిపోయే మాస్ స్టెప్పులతో డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. పెద్ద డాన్స్ మాస్టర్ అయి ఉండి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు.. ఎం చేయడానికి అని భాస్కర్ ని నాగ్ ప్రశ్నించాడు. నేర్చుకోవడానికి అంటూ భాస్కర్ బదులిచ్చాడు. 

టీవీ నటి రోహిణి : రోహిణి కామెడీ చేస్తూ వేదికపైకి వచ్చేసింది. నాగార్జున రోహిణిని హౌస్ లోకి పంపించాడు. 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ : రంగస్థలం చిత్రంలోని పాట పడుతూ సింగర్ రాహుల్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున వద్ద రాహుల్ తన సింగింగ్ టాలెంట్ ప్రదర్శిస్తున్నాడు. 

టీవీ నటి హిమజ : సీత చిత్రంలోని బుల్ రెడ్డి సాంగ్ కు పెర్ఫామ్ చేస్తూ టివి నటి హిమజ వేదికపైకి వచ్చేసింది. హిమజ గ్లామరస్ డ్రెస్ లో కనిపిస్తోంది. నాగార్జునని చూడగానే వేదికపై గంతేసింది. తాను గుంటూరు జిల్లా వీర్ల పాలెం అనే పల్లెటూరి నుంచి ఈ స్థాయికి వచ్చినట్లు హిమజ చెబుతోంది. 

టీవీ 9 జాఫర్ : టివి9 జాఫర్ స్టేజిపైకి.. ఒకరేంజ్ లో ఇచ్చిన ఇంట్రడక్షన్ తో జాఫర్ నాగార్జున వద్దకు స్టేజిపైకి చేరుకున్నాడు. జాఫర్ జర్నలిస్ట్ గా సాధించిన విజయాల్ని ఇంట్రడక్షన్ లో తెలిపారు. 

బిగ్ బాస్ ఈ ముగ్గురికి ఏదో టాస్క్ ఇస్తున్నారు.. 

శివ జ్యోతి, రవి కృష్ణ, అషు రెడ్డి ముగ్గురూ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 3 లో హౌస్ లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్ శివ జ్యోతి(తీన్మార్ సావిత్రి). బిగ్ బాస్ హౌస్ చూసి శివజ్యోతి ఆశ్చర్యపోతోంది. 

అషు రెడ్డి :డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషు రెడ్డి అందంగా తయారై స్టేజి పైకి వచ్చేసింది. తాను ఎలా పాపులర్ అయ్యానో ఏవి ద్వారా అషు రెడ్డి తెలిపింది. 

రవికృష్ణ : టివి నటుడు రవికృష్ణ కూడా హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. అతడితో కూడా నాగ్ సరదాగా ముచ్చటించాడు. 

తీన్మార్ సావిత్రి : తీన్మార్ సావిత్రిగా పాపులర్ ఐన శివ జ్యోతి ఇప్పుడే బిగ్ బోస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునతో సరదాగా సాగిన సంభాషణ తర్వాత సావిత్రి హౌస్ లోకి ఎంటర్ అయింది. 

నాగార్జున ఎంట్రీ :  'కింగ్' చిత్రంలోని టైటిల్ సాంగ్ తో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో ఉత్సాహభరితంగా బిగ్ బాస్ వేదికపైకి వచ్చేశాడు. వేదికపైకి రాగానే నాగార్జున గత సీజన్ హోస్ట్ లు ఎన్టీఆర్, నానిని అభినందించాడు.