అవును వింటానికి నమ్మశక్యంగా లేకపోయినా ఈ వార్త  నిజం చేయటానికి  ప్రయత్నాలు అయితే జరుగుతన్నాయని సమాచారం. బిగ్ బాస్ కు కావాల్సింది టీఆర్పీలు. రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలు. వివాదాలకు కేరాఫ్ ఎడ్రస్ బిగ్ బాస్. అలాంటి చోట వర్మ ప్రత్యక్ష్యమయితే చూసేవారికి పండగే. అయితే వర్మ అందుకు ఒప్పుకుంటాడా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. అయితే ఆయన్ని ఒప్పించటానికి ప్రయత్నించకుండానే రారు అని డిసైడ్ అవటం ఎందుకు అని బిగ్ బాస్ టీమ్  ప్రయత్నాలు అయితే చేస్తోందట.

తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యారు. పెద్దగా ఫలితం లేదు. తమన్నా ఆల్రెడీ అవుట్, శిల్పా తనేంటో ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది కానీ ఇప్పటికి వరకూ సౌండ్ లేదు. దాంతో నెక్ట్స్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అదిరిపోవాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకోసం రకరకాల పేర్లను పరిశీలించింది. కానీ ఏది పెద్దగా కిక్ ఇవ్వటం లేదట. ఈ నేపధ్యంలో ఆయనకు రామ్ గోపాల్ వర్మ కనిపించారు. ఆయన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందిట. ఆలోచన వచ్చిన వెంటనే అమలలో పెట్టేసారని సమాచారం.

ఇక వర్మ కనుక బిగ్ బాస్ లోకి వస్తే రచ్చ మామూలుగా ఉండని అంటున్నారు. ఆయన అభిమానులతో టీఆర్పీలు దుమ్ము రేపుతాయి. ఆయన ఆలోచనలు, విలువలు, చర్యలతో బిగ్ హౌస్ ఖచ్చితంగా షాక్ కు గురి అవుతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే వర్మకు తెలిసినట్లుగా మరెవరికీ ఎలా ఎక్సపోజ్ అవ్వాలి..వివాదం మొదలెట్టాలి అనే విషయాలు తెలియవు. అయితే ట్విట్టర్, వోడ్కా లేకుండా ఓ వారం అయినా వర్మ ఉండగలరా అనేదే పెద్ద ప్రశ్న..సవాల్.