శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అని ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. రాజకీయ పరంగా వెళుతోందని చాలా కామెంట్స్ వచ్చాయి. అయితే ఎదో ఒక విధంగా పాపులర్ అయితే బిగ్ బాస్ లో అవకాశాలు వస్తాయని కొందరు ఆ తరహాలో వెళుతున్నట్లు రూమర్స్ వచ్చాయి.  జులై లో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ స్టార్ట్ కానుంది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉంది. కంటెస్టెంట్స్ సెల్సక్షన్స్ కూడా అయిపోయాయి. అయితే సెలక్షన్ కమిటీలో శ్రీ రెడ్డి పేరు వినిపించినప్పటికీ ఆమె ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని నిరాకరించినట్లు తెలుస్తోంది. 

మితిమీరిన ఎక్స్ పోజింగ్ అలాగే బూతులు మాట్లాడిన తీరుకు చాలా మంది ఆమెపై నెగిటివ్ ఇంప్రెషన్ తో ఉన్నారని పైగా పాలిటిక్స్ తో సంబంధాలు అనే టాక్ ఎక్కువవుతుండడంతో స్టార్ మా ఆమె గురించి ఎక్కువగా ఆలోచించలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం శ్రీ రెడ్డిని టీవీ ఛానెల్స్ ఎక్కువగా డిబేట్స్ కి కూడా పిలవడం లేదు. ఆమె వ్యవహార తీరు వల్ల ఛానెల్స్ పై ఎక్కువగా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిందనే టాక్ కూడా నడుస్తోంది.