బిగ్ బాస్‌తో ఆరవ్ కోలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. హౌస్‌లో నటి ఒవియాతో ఓ రేంజ్‌లో కెమిస్ట్రీ పండించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ సక్సెస్‌లో ఆరవ్, ఒవియాలదే కీలక పాత్ర. అయితే హౌస్‌లో ఉండగానే ఆరవ్, ఒవియా మధ్య విభేదాలు రావటం, ఒవియా ఆత్మహత్యాయత్నం చేయటం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.
లాక్ డౌన్ సమయంలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. యంగ్ జనరేషన్ స్టార్స్‌కు గ్యాప్ దొరకటంతో అంతా ఫ్యామిలీ పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలు నిఖిల్, నితిన్, రానా లాంటి వారు లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి బంధంలో ఒక్కటి అయ్యారు. తాజాగా కోలీవుడ్ యంగ్ హీరో ఆరవ్ కూడా పెళ్లి బంధంలో ఒక్కటి అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.
బిగ్ బాస్‌తో ఆరవ్ కోలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. హౌస్‌లో నటి ఒవియాతో ఓ రేంజ్‌లో కెమిస్ట్రీ పండించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ సక్సెస్‌లో ఆరవ్, ఒవియాలదే కీలక పాత్ర. అయితే హౌస్‌లో ఉండగానే ఆరవ్, ఒవియా మధ్య విభేదాలు రావటం, ఒవియా ఆత్మహత్యాయత్నం చేయటం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. అయితే గత ఏడాది కాలంగా ఆరవ్, మోడల్ రేహీతో ప్రేమాయణం నడుపుతున్నాడు.
ఇరు వర్గాలు పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అవుతున్నారు. ఆరవ్ హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం రాజా భీమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుంది. నరేష్ సంపత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆరవ్ చేసుకోబోయే అమ్యాయి రేహీ గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న `జోషువా ఇమాయి పోల్ కాకా` అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానుంది.
