బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన వెంటనే పెళ్లి!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 4, Sep 2018, 11:45 AM IST
Bigg Boss Tamil 2 fame Danny ties the knot
Highlights

రియాలిటీ షోలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళంలో కూడా సీజన్ 2 నడుస్తోంది. 

రియాలిటీ షోలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళంలో కూడా సీజన్ 2 నడుస్తోంది. ఆదివారం ఎపిసోడ్ లో తమిళ బిగ్ బాస్ నుండి డేనియల్ అన్నె ఎలిమినేట్ అయ్యారు.

తమిళనాట నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ చాలా కాలంగా డెనీషా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. డేనియల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన సమయంలో అతడిని కలవడానికి డెనీషా వచ్చి వెళ్లింది. అయితే ఆదివారం ఆయన ఎలిమినేట్ అవ్వగా, మరుసటిరోజు తెల్లారే వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది. కొన్ని కారణాల వలన రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

తన వివాహానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు డేనియల్. నిజానికి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు డేనియల్. ఫైనల్స్ వరకు అతడు ఉంటాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ కొన్ని రోజులుగా అయన కొంచెం డల్ కావడంతో ఓట్లు తగ్గి ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader