Asianet News TeluguAsianet News Telugu

తెలుగు `బిగ్ బాస్`-5 బిగ్ అప్డేట్ !

 ఇప్పుడు 5వ సీజ‌న్‌కి ముహూర్తం ఖ‌రారైంది. తాజా సమాచారం ప్రకారం.. సీజన్ 5 జూలైలో ప్రారంభమవుతుందని షో నిర్వాహకులు స్టార్ మా నెట్‌వర్క్ కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
 

Bigg boss started zoom interviews jsp
Author
Hyderabad, First Published Jun 5, 2021, 7:03 PM IST

ఈ మధ్యకాలంలో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో  బాగా సక్సెస్ అయిన రియాల్టీ షో `బిగ్ బాస్`. ఈ షోని నాగార్జున‌, ఎన్టీఆర్‌, నాని లాంటి హోస్ట్ చేయటంతో ఓ రేంజిలో పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలో బిగ్ బాస్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ 4 సీజ‌న్లు సక్సెస్ ఫుల్ గా పూర్త‌య్యాయి. ఇప్పుడు 5వ సీజ‌న్‌కి ముహూర్తం ఖ‌రారైంది. తాజా సమాచారం ప్రకారం.. సీజన్ 5 జూలైలో ప్రారంభమవుతుందని షో నిర్వాహకులు స్టార్ మా నెట్‌వర్క్ కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి మే లాస్ట్ వీక్ లోనే ఈ సీజ‌న్‌ని స్టార్ట్ అవ్వాలి. కానీ… క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రత వ‌ల్ల ఆగిపోయింది. ఇప్పుడు జూన్‌లో ఈ సీజ‌న్ మొద‌లెట్టాల‌ని సంస్ద ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సెల‌బ్రెటీల లిస్టు కూడా  త‌యారైంది. ఇప్పుడు వాళ్ల‌కు జూమ్ ద్వారా ఇంట‌ర్వ్యూలు కూడా నిర్వ‌హిస్తున్నార‌ని సమాచారం. `మా` టీమ్ రోజుకి ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇంకో వారంలో అన్ని అనుకున్నట్లు అయితే ఫైనల్ లిస్ట్ ఓకే అవుతుంది.

 కోవిడ్ నిబంధనలను పాటిస్తూ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించే ముందు పోటీదారులను ఒంటరిగా ఉంచుతామని, రియాలిటీ షో షూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని వర్గాలు వెల్లడించాయి.  బిగ్ బాస్ హౌస్‌లో ప్ర‌వేశ పెట్టే ముందు… కంటెస్టెంట్లు అంద‌రినీ హోం క్వారెంటైన్‌ని పంపాల్సి  ఉంటుంది.కాబ‌ట్టి… 15 రోజుల ముందుగానే ఈ ప్రోసెస్ ని మొద‌లు పెట్టాలి. అభ్యర్థుల కోసం ఆడిషన్లు వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్‌ఫామ్, జూమ్ ద్వారా జరుగుతున్నాయి.  ఈసారి ప్రైజ్ మ‌నీ కూడా పెంచే అవ‌కాశాలున్న‌ట్టు టాక్‌.

అలాగే బిగ్ బాస్ 5 కి హోస్ట్‌గా ఈసారి కూడా నాగార్జునే వస్తారని భావిస్తున్నారు. సీజన్ 3, సీజన్ 4 లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున షో టీఆర్పీ రేటును పెంచగలిగారు. 2 వ సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా, మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios