Asianet News TeluguAsianet News Telugu

అనుష్కకి ఐ లవ్యూ చెప్తా.. `బిగ్‌ బాస్‌` బ్యూటీ ఇనయ లవ్‌ ప్రపోజల్‌పై సోహైల్‌ స్పందన..

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, లక్కీ లక్ష్మణ్‌ హీరో సోహైల్‌పై బిగ్‌ బాస్‌  బ్యూటీ ఇనయ కి ఉన్న క్రష్‌ గురించి తెలిసిందే. ఇటీవల ఆయనకు లవ్‌ ప్రపోజల్‌ చేసింది. తాజాగా దీనిపై సోహైల్‌ స్పందించారు.

bigg boss sohel react on inaya love proposal he crush on star heroine
Author
First Published Dec 29, 2022, 6:05 PM IST

బిగ్‌ బాస్‌ 6లో పాపులర్‌ అయిన ఇనయ సుల్తానా ఇటీవల బిగ్‌ బాస్‌ 4 పాపులర్‌ కంటెస్టెంట్‌ సోహైల్‌కి లవ్‌ ప్రపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఓ కాఫీ షాప్‌లో సోహైల్‌కి ఇనయ తన ప్రేమని ప్రకటించింది. తాను ప్రేమిస్తున్నానని ఫ్లవర్స్ బోకే ఇచ్చింది. `ఐలవ్యూ` చెప్పింది. ఆయనంటే ఎంతో క్రష్‌ అని పేర్కొంది. మీ రియాక్షన్‌ కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది. దీనికి సోహైల్‌ ఆశ్చర్యపోయాడు. ఏం చెప్పాలో తెలియక సతమతయ్యాడు. తనకు ఓ అమ్మాయి ఇలా ఓపెన్‌గా లవ్‌ ప్రపోజ్‌ చేయడం పట్ల ఆయన మిక్స్ డ్ ఫీలింగ్‌కి లోనయ్యాడు. 

అయితే దీనిపై తాజాగా సోహైల్‌ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇనయ లవ్‌ ప్రపోజల్‌ పై ఓపెన్‌ అయ్యాడు. తనంటే ఇనయకి చాలా క్రష్‌ ఉందని, ఆమె సిన్సియర్‌గా తనని ప్రేమిస్తుందని, తనపై ఉన్న ప్రేమ నిజమే అని వెల్లడించారు. అయితే ఆ సమయంలో తను అలా ఫ్రాంక్‌ చేసిందని, తానుషాక్‌కి గురయినట్టు చెప్పాడు. అయితే తనకు ప్రేమించే టైమ్‌ లేదని, ఇప్పుడు కెరీర్‌ ముఖ్యమన్నారు సోహైల్‌. తనకు లవ్వు, గివ్వు వర్కౌట్‌ కాదన్నారు. 

అదే సమయంలో తనకు ఉన్న క్రష్‌ ని బయటపెట్టాడు. తనకు అనుష్క శెట్టి అంటే క్రష్‌ అని చెప్పాడు. ఆమె కలిస్తే కచ్చితంగా లవ్‌ ప్రపోజ్‌ చేస్తానని వెల్లడించారు. ఆమె కొట్టినా, తిట్టినా ఫర్వాలేదు, తానైతే ప్రేమని వ్యక్తం చేస్తానని పేర్కొన్నాడు సోహైల్‌. మొత్తానికి తన మనసులోని మాటని బయటపెట్టాడు సోహైల్‌. ప్రస్తుతం సోహైల్‌ `లక్కీ లక్ష్మణ్‌` చిత్రంలో నటించారు. ఏఆర్‌ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించారు. రేపు శుక్రవారం(డిసెంబర్‌30)న ఈ చిత్రం విడుదల కానుంది. 

ఈ సందర్భంగా గురించి సోహైల్‌ మాట్లాడుతూ, ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. తెలుగు ప్రజలే నా ధైర్యం. మీరే నా సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అనూప్ అన్న మంచి సంగీతాన్ని అందించారు. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంది. హరిత గారు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు, ఏడుస్తారు. డిసెంబర్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి' అని అన్నారు.

సినిమా గురించి దర్శకుడు అభి చెబుతూ, `సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు. ఈ సినిమా చేద్దామని అనుకున్న తరువాత సోహెల్‌ను కలిశాం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ఓకే చెప్పాడు. ఇకపై నా సినిమాలన్నింటికి కెమెరామెన్‌గా ఆండ్రూ సారే ఉంటారు. అనూప్ సర్‌ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌. ప్రవీణ్‌ ఎడిటింగ్, భాస్కరభట్ల పాటలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు సెకండ్ చాయిస్ లేదు. మోక్ష చాలా బాగా నటించారు. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. సోహైల్‌ ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ నాకు తెలుసు. కానీ ఎంత మందికి సాయం చేస్తారో మీకు తెలీదు. అవుట్ సైడ్ కాదు ఇన్ సైడ్ కూడా బ్యూటీఫుల్. దేనికి పనికి రాను అనే సమయంలో హరిత నన్ను నమ్మంది. ఆమె ఓ మంచి నిర్మాత. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు' అని అన్నారు.

నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. 'అభికి చిన్నతనం నుంచి డైరెక్షన్ పిచ్చి ఉంది. చిన్నతనంలో నా కోరికలేవీ తీరలేదేమో గానీ.. అభి తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికను తీర్చాలని అనుకున్నాను. అందుకే మా ప్రతీ చెమట చుక్కని డబ్బుగా మార్చి ఈ సినిమాను తీశాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా ఇది మాకు చాలా పెద్ద సినిమా. కంటెంట్ ఉన్న మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్‌ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. మేం చేసిన పనిని గుర్తించండి' అని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios