బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది.
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే.
చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది.
ప్రస్తుతం సిరి, శ్రీహాన్ హాట్ హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ లో గ్లామర్ విందు వడ్డిస్తున్నారు. సిరి తరచుగా సోషల్ మీడియాలో ఫొటోస్, ఇన్స్టా రీల్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సిరి పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో సిరి.. సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కిసీకి భాయ్ కిసీకి జాన్' చిత్రంలోని 'ఏంటమ్మా' అంటూ సాగే పంచె కట్టు సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
ఈ సాంగ్ లో సల్మాన్ ఖాన్ తో పాటు విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పంచె కట్టులో మెరిశారు. ఈ సాంగ్ కి సిరి ఫ్లోర్ అదిరిపోయేలా పంచె కట్టులో డ్యాన్స్ ఇరగదీసింది. ఒక దశలో ఎక్కడ పంచె ఊడిపోతుందో అని కూడా అనిపించింది. అంత వేగంగా రెచ్చిపోయి సిరి డ్యాన్స్ చేసింది.
సిరి డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. పంచె ఊడిపోతుంది ఏమో జాగ్రత్త అని కొందరు హెచ్చరిస్తున్నారు. మరికొందరు డ్యాన్స్ అద్భుతంగా చేసావ్ అని అభినందిస్తుంటే.. ఇలాంటివి ఇక ట్రై చేయకు అని హెచ్చరిస్తున్నారు. మరికొందరు షణ్ముఖ్ లైఫ్ నీవల్లే నాశనం ఐంది అంటూ సంబంధం లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఇక బోల్డ్ యాంకర్ విష్ణుప్రియ.. సిరి డ్యాన్స్ వీడియోకి 'చాలా బాగా చేసావ్ రా' అంటూ క్యూట్ కామెంట్ పెట్టింది.
