Asianet News TeluguAsianet News Telugu

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ కేసులో కీలక పరిణామం.. మరో ముగ్గురి అరెస్టు..

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ నాడు అన్నపూర్ణ స్టూడియో సమీపంలో జరిగిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు

Bigg Boss season 7 violence: Police detain 3 more people KRJ
Author
First Published Dec 26, 2023, 4:24 AM IST

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ నాడు అన్నపూర్ణ స్టూడియో సమీపంలో జరిగిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూసుఫగూడకు చెందిన సుధాకర్‌, పవన్‌, సరూర్‌నగర్‌కు చెందిన అవినాష్‌రెడ్డి అనే విద్యార్థిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన విధ్వంసం, దాడి ఘటనలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.  

ఇదిలా ఉంటే.. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని కండీషన్ పెట్టి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. కొన్ని రోజుల పాటు ఎలాంటి మీడియా ప్రకటనలు గానీ, ఇతర ఇంటర్వ్యూలు గాని, ఇవ్వొద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రశాంత్ ప్రస్తుతం స్వగ్రామంలో ఉన్నాడు. ప్రశాంత్ తాజాగా తన తోటి కంటెస్టెంట్స్ శివాజీ, యావర్, భోలేలను కలిశాడు.

అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్‌ నాడు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమీపంలో ఘర్షణ వాతావరణం నెలకుంది. స్టూడియోస్‌ వద్దకు భారీగా పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ ఫ్యాన్ చేరుకున్నారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఇక టైటిల్‌ విజేతగా ప్రశాంత్‌‌ను ప్రకటించిన తర్వాత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో కొంత మంది ఆకతాయిలు అమర్‌దీప్‌,  అశ్వినీ, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతు రాయల్ కార్లను ధ్వంసం చేశారు.

అదే సమయంలో వారికి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాహనాలు, పలు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అక్కడి పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఈ ఘటనపై పోలీసులు చాలా సిరీయస్ అయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధ్వంసక చర్యకు బిగ్ బాగ్ విన్నర్  పల్లవి ప్రశాంతే ‌ కారణమని అభియోగంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌,ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ ల‌ను చేర్చారు. ఈ క్రమంలో పోలీసులను వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కండీషన్ బెయిల్ లభించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios