Asianet News TeluguAsianet News Telugu

భయంతో వణికిపోయిన శ్రీహాన్, ఆదిరెడ్డి, దెయ్యాల గదిలోకి పిలిచి హడలెత్తించిన బిగ్ బాస్

రోజూ హోరా హోరీ టాస్క్ లు, గొడవలు.. సై అంటే సై అన్న కంటెస్టెంట్స్ వణికిపోయేలా చేశాడు బిగ్ బాస్. డిఫెంట్ టాస్క్ తో వారిని భయపెట్టేలా చేశాడు. అరుపులు..కేకలతో చెమటలు పెట్టించాడు. 
 

Bigg Boss Season 6 Telugu 94th day
Author
First Published Dec 7, 2022, 11:12 PM IST


రోజూ హోరా హోరీ టాస్క్ లు, గొడవలు.. సై అంటే సై అన్న కంటెస్టెంట్స్ వణికిపోయేలా చేశాడు బిగ్ బాస్. డిఫెంట్ టాస్క్ తో వారిని భయపెట్టేలా చేశాడు. అరుపులు..కేకలతో చెమటలు పెట్టించాడు. 

బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ సీక్స్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. రోజులు గడిచేకొద్ది టాస్క్ లు ఇంకా ఇంట్రెస్టింగ్  గా మారుతున్నాయి. ఆటలు ఇంకా టఫ్ గా మారుతున్నాయి. ఈక్రంలోనే ఈరోజు  ఎపిసోడ్ లో.. హౌస్మెంట్స్ గజగజా వణికేలా చేశాడు బిగ్ బాస్. దెయ్యాల రూములో పడేసి ఏడిపించాడు. వింత వింత టాస్క్ లతో హడలెత్తించాడు. ముఖ్యంగా హౌస్ లో కాలర్ ఎగరేసేవారిచేత అరుపులు కేకలు పెట్టించాడు బిగ్ బాస్. 

ముందుగా టాస్క్ లతో మొదలైన ఎపిసోడ్ లో... ఆదిరెడ్డి-రోహిత్ మధ్య టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారంటూ అడగ్గా.. ఆదిరెడ్డిపై ఎక్కువ డబ్బులు పెట్టారు అంతా.  మరో వైపు రోహిత్ కు శ్రీసత్య మాత్రమే సపోర్ట్ చేయగా.. ఆ గేమ్ లో ఆదిరెడ్డి గెలుపొందారు. ఇక నెక్ట్స్ టాస్క్ లో శ్రీ హాన్ - కీర్తి మధ్య పోటీ జరగ్గా.. హౌస్ అంతా.. శ్రీహాన్ పై నమ్మకం ఉన్నట్టు ప్రకటించారు. శ్రీహాన్ గెలుస్తాడని అన్నారు. అందరు అనుకున్నట్టుగానే గేమ్ లో శ్రీహాన్ విన్ అయ్యాడు. వాల్ బ్రేకర్స్ టాస్క్ లో శ్రీహాన్ విజేతగా నిలిచాడు. హౌస్ అంతా యూనానిమస్ గా టోటల్ టాస్క్ లో శ్రీహాన్ ను విన్నర్ గా ప్రకటించారు.  


టాస్క్ ల ద్వారా  కోల్పోయిన డబ్బును పొందడం  కోసం సీక్రేట్ రూమ్ టాస్క్  పెట్టాడు బిగ్ బాస్ అందులో బాగంగా దెయ్యాల గది టాస్క్ పెట్టాడు. మిగతా టాస్క్ లలో తగ్గేదే లే అంటూ.. హోరా హోరీగాపోరాడుతూ.. పోటీ ఇచ్చే శ్రీహాన్ - ఆదిరెడ్డీలను ముందుగా టాస్క్ లో భాగంగా చీకటి గదిలోకి పంపించాడు బిగ్ బాస్. అంతే కాదు అక్కడ బిగ్ బాస్ కు సబంధించిన సెటప్ అంతా హారర్ సెట్టింగ్ తో భయంకరంగా మారిపోయింది. ఆ అట్మాస్పియర్ లో ముందు గదిలోకి వెళ్ళిన ఆదిరెడ్డికి .. అక్కడ ఉన్న క్యాండిల్ వెతకమని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కొంత సేపటికి అతనికి ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. బయట ఉన్నహౌస్ మెంట్స్ లో .. ఎవరిసహాయం అయినా తీసుకోవచ్చి అని అన్నాడు. దాంతో ఆదిరెడ్డి శ్రీహాన్ కావాలి అని అడిగాడు. 

బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ తో.. ఉలిక్కి పడ్డాడు శ్రీహాన్. డార్క్ రూమ్ లోకి వెళ్ళిన తరువాత క్యాండిల్ తో పాటు.. అక్కడే ఉన్న గన్ ను వెతకాల్సిందిగా బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. దాంతో ఇద్దరు భయపడుతూ.. వణికిపోయారు. దాంతో పాటు ఆ రూమ్ లో  హరర్ సౌండ్స్కు.. అక్కడ ఉన్న వింత బొమ్మలు.. వేశాలు వేసుకుని సైలెంట్ గా దెయ్యాల మాదిరి నిలుచున్న ఆర్టిస్ట్ లను చూసి.. భయపడకుండా ఉండలేకుపోయారు ఇద్దరు. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా.. వారిని ఏదో రకంగా భయపెట్టారు బిగ్ బాస్. 

ఇక ఈ ఎపిసోడ్ లో వీరు భయపడుతుంటే... బయట ఆడియన్స్ కు భలే ఫన్ దొరికింది. ప్రోమోతేను ఈ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ పెంచాడు బిగ్ బాస్ . అంతే కాదు ఆ డార్క్ రూమ్ లోకి దెయ్యం గెటప్ లో ఉన్న ఆర్టిస్ట్ లు గట్టిగానే భయపెట్టారు.  ఇక హౌస్ లో ఉన్నవారు కూడా ఈ టాస్క్ ను బలే ఎంజాయ్ చేశారు. లోపల ఉన్నవారు భయపడి చచ్చిపోతుంటే.. బయట ఉన్నవారు ఫన్నీ జోక్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. చివరకు ఎలాగొలా క్యాండిల్ తో పాటు.. గన్ ను కూడా సాధించి బయటపడ్డారు శ్రీహాన్- ఆదిరెడ్డి. 

Follow Us:
Download App:
  • android
  • ios