యాంకర్ రవికి నటుడు మానస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రాన్స్ జెండర్ ప్రియాంకతో మానస్ ని లింక్ చేస్తూ రవి పదేపదే కామెంట్ చేయడం మానస్ కి నచ్చడం లేదు.
బిగ్ బాస్ షో మొదటివారానికి దగ్గర పడుతుంది. మరో రెండు రోజుల్లో నామినేట్ అయిన ఆరుగురు సభ్యులలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. ఇక మొదటి వారంలోనే హౌస్ మేట్స్ మధ్య వాడి వేడిగా గొడవలు జరుగుతున్నాయి. తనకు ఆలు కర్రీ పెట్టనందుకు అని మాస్టర్ పై ఉమాదేవి విరుచుకుపడ్డారు. నేను అడుక్కుతినడానికి రాలేదు అంటూ, పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు.
ఇక హమీదా, లహరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. లహరి ప్రశ్నలకు హమీదా చెప్పిన సమాధానం రూడ్ గా ఉందంటూ లహరి అసహనం వ్యక్తం చేశారు. నేను ఇలాగే మాట్లాడతా అంటూ హమీదా లహరికి సమాధానం చెప్పారు. కాసేపటి తరువాత ఒకరిని ఒకరు హగ్ చేసుకొని, గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు.
ఐతే యాంకర్ రవికి నటుడు మానస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రాన్స్ జెండర్ ప్రియాంకతో మానస్ ని లింక్ చేస్తూ రవి పదేపదే కామెంట్ చేయడం మానస్ కి నచ్చడం లేదు. మానస్ ని నేను అన్నయ్య అని పిలవమని ప్రియాంక చెప్పిన నాటి నుండి మానస్ ని ఈ విషయంలో టార్గెట్ చేస్తున్నారు. కాగా నిన్న ఎపిసోడ్ లో ఈ విషయమై మానస్ రవికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
నువ్వు బయట యాంకర్ కావచ్చు, ఇక్కడ కాదు, మా అమ్మ ఇక్కడకు వచ్చినప్పుడు నీకు గట్టిగా ఉంటుందని హెచ్చరించాడు. మానస్ మమ్మీ బాయ్ అని నాగ్ ఓపెనింగ్ ఎపిసోడ్ రోజు రివీల్ చేయగా, నిన్న ఎపిసోడ్ లో మానస్ అమ్మ ప్రస్తావన తీసుకొచ్చిన తీరు చూస్తే, ఎంత అమ్మ చాటు బిడ్డో అర్థం అవుతుంది.
