బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. హోస్ట్ నాగార్జున టాలీవుడ్ స్టార్స్ తో కలర్ఫుల్ గా షోని నడిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ మెహ్రీన్, లక్ష్మీ రాయ్, ప్రణీత షోలో భాగమైన ఎంటర్టైన్ చేశారు. వీరి అట పాటలు ఫినాలేలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా ఈ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వచ్చారు. ఆయన చేతుల మీదుగా విన్నర్ టైటిల్ అందుకున్నారు. 

 
ఫైనల్ కి అభిజీత్, హారిక , అఖిల్, సోహైల్ మరియు అరియనా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా మొదట హారిక ఎలిమినేటయ్యారు. ఆ తరువాత అరియనా ఎలిమినేటై నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక టైటిల్ కోసం సోహైల్, అఖిల్ మరియు అభిజీత్ పోటీపడ్డారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సిన ఉండగా, నాగార్జున ఒక ఆఫర్ ప్రకటించారు.ముగ్గురిలో ఒకరు 25లక్షలు తీసుకొని హౌస్ నుండి బయటికి వెళ్లిపోవచ్చని చెప్పడం జరిగింది. ఈ ఆఫర్ కి సోహైల్ ఒప్పుకొని... హౌస్ నుండి బయటికి వచ్చేశాడు. 
 
బిగ్ బాస్ టైటిల్ కోసం అభిజీత్ మరియు అఖిల్ పోటీపడ్డారు. ఈ ఇద్దరు టాప్ టూ ఫైనలిస్ట్స్ ని సంబరంగా వేదికపైకి తీసుకొచ్చిన నాగార్జున ఒకరిని విజేతగా తేల్చారు. అఖిల్ మరియు అభిజీత్ చేతులు పట్టుకున్న నాగార్జున... అభిజీత్ విన్నర్ అంటూ తన చేయి పైకి లేపారు. కాగా బిగ్ బాస్ ఫినాలేకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. విన్నర్ అయిన అభిజీత్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ అందుకున్నారు. అభిజీత్ ఈ సీజన్ విన్నర్ అని చాలా కాలంగా ప్రచారం జరుగుతుండగా అదే నిజం అయ్యింది. అభిజీత్ విన్నర్ గా, బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు. ఇక అఖిల్ రన్నర్ గా నిలవడం జరిగింది.