కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ముగిసిన వీకెండ్ లో నాగార్జున ఇంటి సభ్యులంతా మాస్క్ లు తీసేసి హౌస్ లో మెలగాలని రెచ్చగొట్టి వదిలిపెట్టారు. కంటెస్టెంట్స్ కూడా ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ఇకపై నామినేషన్ ప్రక్రియ కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

సోమవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని చూపించారు. ఇంటి సభ్యులు ఎక్కువగా రాహుల్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందరూ రాహుల్ ముఖానికి ఎరుపు రంగు పూస్తున్న  దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి. 

వీరందరిని రాహుల్ ఎలా ఎదుర్కొంటాడనేది సోమవారం జరిగే ఎపిసోడ్ లో తేలనుంది. రాహుల్ మొదటి నుంచి చాలా స్వల్ప తేడాతో ఎలిమినేషన్ నుంచి బయటపడుతున్నారు. ఇక అతడు పునర్నవితో సాగిస్తున్న రొమాన్స్ ట్రాక్ కూడా హాట్ టాపిక్ గా మారింది.