తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. పదిహేను మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆదివారం నాడు పోటీదారులను పరిచయం చేస్తూ హోస్ట్ నాగార్జున షో ముగించారు. 

ఎపిసోడ్ 2 హైలైట్స్ విషయానికొస్తే.. తొలిరోజు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి ముగ్గురు కంటెస్టంట్స్ రవికృష్ణ, శివజ్యోతి, ఆషూలకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఆదేశించిన ప్రశ్నలను మిగిలిన కంటెస్టంట్స్ ని అడిగి సమాధానాలు రాబట్టాలి. ఇలా సమాధానాలు రాబట్టి వాటిలో ఎవరైతే కరెక్ట్ గా సమాధానం చెప్పలేదో.. వాటిని ముగ్గురు చర్చించి చెప్పాలి బిగ్ బాస్ ఆదేశించారు.

దీంతో వారు.. రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితికా, శ్రీముఖి, జాఫర్ ల పేర్లు చెప్పడంతో ఆ ఆరుగురు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వారు ఎలిమినేషన్ లో ఉన్నట్లు తెలిపారు బిగ్ బాస్. అయితే ఈ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి ఓ అవకాశం ఇస్తూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఈ టాస్క్ ని నిర్వహించడానికి ఈ ఆరుగురిని నామినేషన్ నుండి తప్పించడానికి ఓ మానిటర్(కెప్టెన్)ని ఎన్నుకోవాలని బిగ్ బాస్ ఈ ఆరుగురికి అవకాశం ఇవ్వగా.. ఈ ఆరుగురు కలిసి నటి హేమ పేరుని సూచించారు.

అలా మానిటర్ గా రంగంలోకి దిగిన హేమ టాస్క్ ని బాధ్యతగా నిర్వర్తిస్తానని దయచేసి ఆడియన్స్ తనను తిట్టుకోవద్దని కెమెరా వద్దకు వెళ్లి చెప్పింది. తదుపరి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ ఉండడంతో షో ఆసక్తిగా మారింది.