బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 14 టాలెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న పిస్తా ధాకడ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  24ఏళ్ల పిస్తా ధాకడ్ అకాల మరణం బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు, బాలీవుడ్ ప్రముఖులను విషాదంలోకి నెట్టింది. 

నిన్న వీకెండ్ కావడంతో పిస్తా ధాకడ్ షో షూటింగ్ ముగిసిన అనంతరం స్కూటీపై నివాసానికి వెళుతున్నారు.  అసిస్టెంట్ తో పాటు స్కూటీపై ఇంటికి వెళుతున్న క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో క్రింద పడిన పిస్తా ధాకడ్ పై నుండి వ్యాన్ దూసుకువెళ్లింది. దీనితో పిస్తా ధాకడ్ అక్కడిక్కడే దుర్మరణం చెందడం జరిగింది. 

పిస్తా ధాకడ్ అసిస్టెంట్ కి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.  పిస్తా ధాకడ్ మరణ వార్త విన్న హీరోయిన్  యువికా చౌదరి ఎమోషనల్ అయ్యారు. ఇంత త్వరగా ఎలా వెళ్లిపోయావ్, ఇలాంటి సందేశము పంచుకోవాల్సి వస్తుందని ఊహించలేదు.. అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.