Asianet News TeluguAsianet News Telugu

బిర్యానీ పెట్టి మరీ దీక్షను పంపించేశారు.. బైటపడ్డ హరితేజ అసలు రంగు

  • ఈ వారం ఎలిమినేషన్స్ లో కన్ఫమ్ అయిన దీక్షా పంథ్
  • వెళ్తూ వెళ్తూ హౌజ్ మేట్స్ అందరిపై బిగ్ బాంబ్ వేసిన దీక్ష
  • హౌజ్ ను వీడే ముందు చాలా నేర్చుకున్నానని ఎమోషనలైన దీక్ష
  • రింగ్ మాస్టర్ అర్చన అని, హరితేజ ఆమెకు హెల్ప్ చేసిందన్న దీక్ష
bigg boss reality show enters into last week diksha eliminated

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో చివరి వారంలోకి ప్రవేశించింది. ఇక చివరి వారం కావటంతో మిగిలిన ఐదుగురు కంటెస్టంట్స్ లో ఎవర్నీ ఎలిమినేషన్ కు నామినేట్ చేయబోమని హోస్ట్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కాగా జులై 16న ప్రారంభం అయినప్పుడు 14 హౌజ్ లో అడుగుపెట్టగా ఈ వారాంతానికి ఆరుగురు మిగిలారు. ఇప్పటికే ఆదర్శ్ హరితేజ సేఫ్ జోన్ లో వున్నారని హోస్ట్ ప్రకటించిన నేపథ్యంలో... అర్చన, దీక్ష ఇద్దరే మిగిలి వున్నారు. వీళ్లలో దీక్షను పంపించేశారు బిగ్ బాస్. మరి అర్చన ఎలా సేఫ్ అయింది. హౌజ్ లో ఏం జరిగింది చూద్దాం.

 

షో మొదలవగానే నిన్న నేను బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లాను. సరదాగా గడిపాను. ఇంకాసేపు వుండబోతున్నానని చెప్పినట్లుగా నేను వుండి ఏం చేశానో చూడండి అంటూ చూపించాడు ఎన్టీఆర్. హౌజ్ మేట్స్ కోసం మటన్ పులావ్, టమాటా పచ్చడి చేసి పెట్టాడు. వంట వండుతూ... మిగతా సభ్యులకంటే తనకున్న సింపథీ హార్ట్ మూలంగా దీక్ష సహకారం కాస్త ఎక్కువగా తీసుకున్న ఎన్టీఆర్... వంట చేస్తూనే మరోవైపు హౌజ్ మేట్స్ కు రకరకాల సెటైర్స్ వేశారు. అర్చనను ఆ మిరపకాయలు తెమ్మంటూ.. సరిగ్గా ప్యాక్ క్లోజ్ చేశారా లేదా చూసుకోండి అంటూ.. దీక్ష ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటే మీరు అలాగే వుండిపోతారు అంటూ అర్చనకు సెటైర్ వేశారు ఎన్టీఆర్. తర్వాత అర్చనను మీ బోయ్ ఫ్రెండ్ ఎలా వండుతాడని అడగ్గా.. ఎక్కువ కాంటినెంటల్ వండుతతాడంటూ చెప్పింది అర్చన.

ఇక దీక్ష మాత్రం అర్చనకు సెటైర్స్ వేస్తున్నా అడ్వాంటేజ్ తీసుకోకుండా(తొందరగా ఏదీ అర్థం కాదు కదా) ఏమంటున్నారు అని తిరిగి ఎన్టీఆర్ ను అడగటంతో.. నేనేం అనలేదంటూ తారక్ అక్కడితో టాపిక్ కట్ చేశారు. అంతే కాదు ఈ సమయంలోనే.. తాను చిన్నప్పుడు అమ్మ ఇరవై రూపాయలు పాకెట్ మనీ ఇస్తే రెండు మూడు రూపాయలు పానీ పూరి తిని, కరీ పఫ్స్ తెచ్చుకునే వాన్ని అని తారక్ తెలిపారు. ఇక అర్చనలో నచ్చిన అంశం ఏంటని దీక్షను అడగ్గా... మా మధ్య ఆర్గుమెంట్స్ అయినా నాకు హెల్ప్ చేస్తది. అది మాత్రం నచ్చుతది అని సమాధానం ఇచ్చింది.

మరోవైపు హరితేజ ముదురు అంటూ తారక్ కమెంట్ చేశారు. టమాటా పచ్చడి చేస్తూ.. ఆ టమాటాలను హౌజ్ మేట్స్ కేరక్టర్స్ తో పోల్చి కమెంట్ చేశారు ఎన్టీఆర్. అందులో భాగంగానే ఈ టమాటా ముదురు అంటూ హరితేజనుద్దేశించి కమెంట్ చేసిన తారక్ అర్చనలానే ఈ టమాటా కన్ ఫ్యూజన్ లో వుంది అంటూ ఆమెకు చురక వేశారు. ఇక మరో టమాటా అంటూ..శివ బాలాజీలా మెత్తగావున్నా కటువుగా కనిపిస్తోంది అనగా... మరో టమాటాను నవదీప్ చలాకీగా వుందంటూ.. మరో టమాటాను ఆదర్శ్ లా తనలో తనే ఏదో కోల్పోయినట్లుంది అన్నారు. ఇక మరో టమాటా దీక్షలా టెన్షన్ పడుతోందని చమత్కరించారు ఎన్టీఆర్. అయితే తారక్ మాత్రం ఫైర్ అంటూ నవదీప్ కమెంట్ చేశాడు.

ఇక టమాటా పచ్చడి, పులావ్ పూర్తయ్యాక చల్లారుస్తూ.. ఫ్రిజ్ లో వున్న వస్తువులను పరిశీలించారు తారక్. దాంట్లో ముందురోజు చేసిన యాపిల్ ఘీ రోస్ట్ ఫ్రిజ్ లో కనిపించింది. ఓ అరటిపండు కూడా ఫ్రిజ్  లో దాచిన హౌజ్ మేట్స్ దాన్ని ఎలా అయిందో చూపించారు. ఇక హరితేజ చేసిన వంటకం ఓ స్పూన్ తిని.. ఎన్టీఆర్.. నా ఏననుగు ఎక్కడ అంటూ బ్రేక్ తీసుకున్నారు.. తర్వాత తిరిగొచ్చి వంట పూర్తి చేసి హౌజ్ మేట్స్ కు మటన్ పులావ్, వెజిటేరియన్స్ కోసం టమాచ పచ్చడి అన్నం వండి పెట్టారు.

 

ఇక తారక్ హౌజ్ నుండి బయటికొచ్చాక హౌజ్ మేట్స్ అంతా పులావ్, టమాటో పచ్చడి కుమ్మేశారు. కడుపు నిండా తిన్నారు. మహిళలందరూ వంటచేసి పెట్టినప్పుడు అంతా కలిసి తింటే ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేమంటూనే.. ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించేశారు తారక్. నాటీవీ ద్వారా హౌజ్ మేట్స్ ను కలిసి అర్చన, దీక్షలలో ఎవరు సేఫ్ జోన్ లో వున్నారో, ఎవరు పదవ వారం కొనసాగుతున్నారో చెప్పాక.. మిగిలిన వారం రోజులు ఎలిమినేషన్స్ లేవు అని తారక్ చెప్పారు.

ప్రతి ఆదివారం కాలర్ ఆఫ్ ద వీక్ లో మాదిరి ఈసారి సరయు రాజమండ్రి నుంచి కాల్ చేసి బిగ్ బాస్ అయిపోయాక రోజు రాత్రి 9గంటల నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఖరి వారం డబుల్ ఎంటర్ టైన్ చేయాలని కోరారు.

ఇక ఆతర్వాత ఊరించి ఊరించి చివరకు.. దీక్ష,అర్చనలలో సేఫ్ జోన్ లో అర్చన వుందని.. ఓటింగ్ ద్వారా అర్చన కొనసాగాలి అని తేల్చినట్లు తారక్ చెప్పారు. దీంతో గ్రాండ్ ఫినాలేకు శివబాలాజీ, అర్చన, నవదీప్, ఆదర్శ్, హరితేజలు హౌజ్ లో మిగిలారు.

 

ఇక వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ ఆదేశం మేరకు వీరి వీరి గుమ్మడిపండు ఆట ఆడారు దీక్ష. ఈ సందర్భంలో రింగ్ మాస్టర్ ఎవరనుకుంటున్నారని దీక్ష అడగ్గా టక్కున అర్చన అని చెప్పేసింది దీక్ష. అనంతరం నాటీవీ ద్వారా హౌజ్ మేట్స్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో దీక్ష తనకు ఇచ్చిన పది పదాల్లో.. రెండింటిని ఎంచుకుని ఒకటి రాసి, మరొకటి ముఖం మీద చెప్పేయాలి. హౌజ్ మేట్స్ దీక్ష ఆరోపణను ఖండిస్తే ఎందుకో డిఫెండ్ చేసుకోవాలి.

అలా మొదట నవదీప్ పేరు రాగా... స్టుపిడ్ అని బోర్డ్ పై రాసి, కన్నింగ్ అని నోటితో చెప్పింది. ఎంటర్ టైన్ మెంట్ అంటూ.. కంటెంట్ కావాలి అంటూ...నవదీప్ ఇతరులిని వాడుకోవడం  సరికాదు అనగా.. సిటువేషన్ లైట్ చేయటానికే అలా చేస్తాను. దీక్షకు భాష అర్థం కాక వచ్చిన సమస్య అది. నేను సీరియస్ గా డిఫెండ్ చేసుకునే అవసరం లేదు.

ఇక శివబాలాజీ... స్టబన్, అరగంట్ అని చెప్పింది. తాను అనుకున్నది కరెక్ట్ అని ఫిక్స్ అవుతారు. కాసేపటికి రియలైజ్ అవుతరు కానీ ముందు హార్ష్ గా మాట్లాడుతారు. శివ బాలాజీ వల్లే ఏడిచానని చెప్పింది. శివ సమాధానంగా అవును నేను అలాంటోన్నే అని చెప్పాడు. ఇక ప్రేమలో ఏడుపు కాబట్టి ఓకే అని శివబాలాజీ రిప్లై ఇచ్చాడు. నేను హర్ట్ అయాను వేరే వాళ్లు చెప్తే అది అర్చన, హరితేజ చెప్తేనే శివబాలాజీ మారారని చెప్పింది.

ఇక హరితేజను ఫూలిష్, మానిపులేటివ్... ఫూలిష్ ఎందుకంటే హౌజ్ మేట్స్ ఫ్రెండ్ షిప్ అని ఫూల్ చేసి ఆడుకుంటున్నారు. అయితే హరితేజ గేమ్ ని మానిపులేట్ చేసింది. అని చెప్పగా... హరితేజ మాత్రం నేను అర్చన కొట్టుకున్నా హేట్రెట్ లేదు, ఫ్రెండ్ షిప్ కుదిరింది. అర్చన నన్ను ఫూల్ చేయట్లేదు. మానిపులేట్ చేయాలనుకుంటే 70రోజులు కుదరదు. ఎక్కడో చోట బైటపడతాం. శివ ఐడియాలజీని మానిపులేట్ చేసే సీన్ నాకు లేదు.. మేమందరం కలిసి మానిపులేట్ చేసే అవసరం లేదు. అనగా దీక్ష అంగీకరించలేదు.

ఇక అర్చన పేరు రాగానే... సెల్ఫిష్ అని, డిస్ గస్టింగ్ అని దీక్ష చెప్పింది. తనకు అవసరముంటే .. పక్కోల్లకి తర్వాత. డిస్ గస్టింగ్.. ఎందుకంటే ఏం మాట్లాడినా తప్పు బట్టి ఆర్గ్యూ చేసి నన్ను పూర్తిగా డిస్టబ్ చేసింది అర్చన.

దీక్ష ఐ లవ్ యు అని చెప్పి, ఇప్పుడు సెల్ఫిష్, డిస్ గస్టింగ్ అంటోంది. తనేంటో చెప్పటానికి ఇది చాలు. నాకు సెల్ఫిష్ అనేది సెట్ కాదు. దీక్ష చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంది. అనుక్షణం దీక్షను ఓ దార్చే పని పెట్టుకోలేదు. అనగా.. దీక్ష కూడా నేను ఎక్కడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నువ్వు డిస్కషన్ మొదలు పెడితేనే.. ఆర్గ్యూ చేశాను. కట్ అయితే పసుపు పెట్టడానికి వెళ్తుంటే... అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనగా.. తన లెవెల్ ఆఫ్ థింకింగ్ అది అని అర్చన కవర్ చేసింది. అంతేకాక కట్ అయినప్పుడు నేను హరి హరి అనుకుంటూ తనదగ్గరికి వెళ్లాను..నేను టెన్షన్లో అలా నిన్ను ఇగ్నోర్ చేసి వెళ్లాను అనగా.. అబద్ధం వద్దు. అంతా రికార్డ్ అయింది. నాకు గుర్తుంది. అబద్ధం చెప్పకు. ఇంటికెళ్లి చూసుకో. అని దీక్ష నిలదీసింది. దీంతో అర్చన సైలెంట్ అయిపోయింది.

ఇక ఆదర్శ్.. పర్ ఫెక్ట్ అని సెన్సిటివ్ అని అంది దీక్ష. దానిపై స్పందిస్తూ పర్ ఫెక్షన్ అనేది ఇల్యూషన్. ఇక సెన్సిటివ్ అంటే రెండేళ్ల క్రితం సెన్సిటివ్ లేదు కానీ ఈ మధ్య నేను సిటువేషన్స్ వల్ల అలా అయిపోయాను. చిన్నప్పుడు నన్ను కొందరు కజిన్స్ బుల్లీ చేశారు. కానీ మనం ఎదుటి వాళ్లని ఎలా ట్రీట్ చేయాలా అని ఆలోచిస్తానని ఆదర్శ్ చెప్పాడు.

ఇక దీక్ష వెళ్తూ వెళ్తూ హౌజ్ మేట్స్ అందరి మీద బిగ్ బాంబ్ వేసి వెళ్లింది. దాని ప్రకారం హౌజ్ లో బెల్ మోగినప్పుడల్లా 4వ ఎక్కం రివర్స్ గా చెప్పాలి. అనగానే... చేస్తా చూపిస్తా... నీ అసలు రూపం ఇది అంటూ హౌజ్ నుంచి వెళ్లి వచ్చిన దీక్షను అర్చన ఫకర్ గా గదమాయించడం కనిపించింది. మరోవైపు దీక్ష కర్టసీ కోసం బైబై చెప్తే.. అమ్మోరు తల్లీ.. ఇక వెళ్లు అంటూ హరితేజ ఓవర్ యాక్షన్ చేసింది. మళ్లీ చివరలో దీక్ష ఐ లవ్ యూ అంటూ సెటైరికల్ గా మాట్లాడి విలన్ లా ప్రవర్తించింది. అయితే హరితేజ గత కొద్ది రోజులుగా చేసిన అతి ఇప్పటికే తన రియల్ కేరక్టర్ బయటపెట్టింది. హరితేజ రియల్ కేరక్టర్ బయటపడటంతో ఖచ్చితంగా టైటిల్ పోరులో హరితేజ లేదని స్పష్టంగా కనిపిస్తుంది.

 

ఇక అర్చనకు కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తూ బిగ్ బాస్ నిర్ణయించారు. అనంతరం దీక్ష అందరికీ థాంక్స్ చెప్తూ ఎమోషనలైంది. దీక్షను ఓదార్చిన ఎన్టీఆర్.. చాలా బాగా ఆడావు. కంటిన్యూ వర్కింగ్ హార్డ్ అన్నారు. చివరగా ఎవరు గెలవద్దో చెప్పండి అని అడగ్గా ఎవరైనా గెలవచ్చు అని వినమ్రంగా చెప్పి దీక్ష ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అర్చన పేరు చెప్తుందని సహజంగా అంతా అనుకుంటారు. ఇక ఎపిసోడ్ ముగిస్తూ.. ఇకపై ఎలిమినేషన్ నామినేషన్స్ వుండవని, వచ్చే శనివారం రాత్రి 12 వరకు విన్నర్ కోసం ఓటింగ్ జరుగుతుందని తారక్ చెప్పారు. వచ్చే ఆదివారం మళ్లీ కలుస్తానన్నారు. అంత వరకు బిగ్ బాస్ హౌజ్ పై ఓ కన్నేసి ఉంచమన్నారు ఎన్టీఆర్.

Follow Us:
Download App:
  • android
  • ios